తెలంగాణ

సంకీర్త్ కుటుంబానికి దత్తన్న పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమెరికాలో హత్యకు గురైన హైదరాబాద్ యువకుడు సంకీర్త్ కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఓదార్చారు. కాచిగూడలోని సంకీర్త్ ఇంటికి ఆయన గురువారం ఉదయం వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. సంకీర్త్ మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఈ విషయమై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశానని దత్తాత్రేయ తెలిపారు. ఉన్నత చదువులు పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సంకీర్త్ హత్యకు గురికావడం తనకు ఆవేదన కలిగించిందన్నారు.