రాష్ట్రీయం

సమయపాలన, క్రమశిక్షణ ఎంతో అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: జీవితంలో సమయపాలన, క్రమశిక్షణ ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ, సమయపాలన, మంచి అలవాట్లు చాలా ముఖ్యమని, ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేందుకు ఇవి ఎంతో దోహదపడతాయని అన్నారు. చదువుతో పాటు సామాజిక బాధ్యతనూ యువత అలవర్చుకోవాలన్నారు.
ఎవరికి వారు తోచినంత మేర సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, సమాజంలోని మూఢనమ్మకాలను పారదోలి, ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు కృషి చేయాలని కోరారు. విద్యావిధానంలో మార్పుల కోసం విశ్వవిద్యాలయాలు దృష్టిపెట్టాలని సూచించారు. నైతికత, సాధికారతను కల్పించే విద్య నేడు అవసరమన్నారు. యూనివర్శిటీ స్థాయి నుండే నైపుణ్యతను సంపాదించి దేశానికి ఉపయోగపడే రీతిలో పరిశోధనల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పలు పుస్తకాల ఆవిష్కరణ
కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖ కవులు రచించిన పుస్తకాలను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం తెలుగుభాష గొప్పదనంపై ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన గీతం, ప్రముఖ కవి జొన్నవిత్తుల తెలుగుపై ఆలపించిన కవితా గానం అందరినీ ఆకట్టుకొంది. ఈ సందర్భంగా ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్ర వెబ్‌సైట్‌ను ఉపరాష్టప్రతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, తిరుపతి ఎంపి బల్లి దుర్గాప్రసాద్‌రావు జిల్లా కలెక్టర్ ఎం.వి.శేషగిరిబాబు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్ట్ డైరక్టర్ మునిరత్నం నాయుడు, వి ఎస్ యూనివర్శిటీ ఉప కులపతి సుదర్శనరావు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం...విక్రమసింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో విద్యార్థులకు పతకాలు అందజేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పక్కన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్