రాష్ట్రీయం

అర్జున్‌దాస్‌పై ప్రభుత్వం వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 29: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న హథీరాంజీ మఠం మహంత్ అర్జున్‌దాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను తొలగిస్తూ రాష్ట్ర ధార్మిక పరిషత్ నుంచి ఎండోమెంట్ అధికారిణి పద్మ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక మఠం ఆలనాపాలనా చూసేందుకు వీలుగా శ్రీకాళహస్తి ఈవోను ఫిట్‌మెన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనేపథ్యంలో బుధవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి తిరుపతిలోని హథీరాంజీ మఠం వద్దకు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కాగా శ్రీవారికి పరమభక్తుడైన హథీరాంజీ బాబాకు భక్తులు సమర్పించిన విలువైన కానుకలు, భూములు దేశవ్యాప్తంగా తిరుపతి, ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లోను వేల కోట్ల రూపాయలు విలువచేసే భూములు, ఆస్తులు ఉన్నాయి. మఠం మహంత్‌గా ఉన్న అర్జున్‌దాస్ ఆ ఆస్తులను పరిరక్షించడానికి బదులుగా కరిగించేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తిన విషయం విదితమే. దీనిపై గత కొనే్నళ్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, మఠం భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని, అలాగే ఒక మహిళపై లైంగికంగా వేధించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలోనే మహంత్ అర్జున్‌దాస్‌ను తొలగిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ సూచనల మేరకు శ్రీకాళహస్తి ఈవో చంద్రశేఖర్‌రెడ్డి బాధ్యతలు తీసుకోవడం కోసం మంగళవారం రాత్రి తిరుమలకు వెళ్లారు. అయితే అర్జున్‌దాస్ బుధవారం ఉదయం బాధ్యతలు అప్పగిస్తామని చెప్పి తెల్లవారేసరికి కొన్ని రికార్డులను తీసుకుని కనిపించకుండా వెళ్లిపోయారని సమాచారం. దీంతో శ్రీకాళహస్తీశ్వరాల య ఈఓ మఠం కార్యాలయానికి చేరుకుని ఆర్జేసీ సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. ఈసందర్భంగా ఈవో విలేఖరులతో మాట్లాడుతూ అర్జున్‌దాస్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి, మ ఠం బాధ్యతలను తనకు అప్పగిస్తూ ఆదేశా లు ఇవ్వడంతో తాను బాధ్యతలు స్వీకరించానన్నారు. అయితే ఎలాంటి ఆరోపణలు ఉన్నాయనే విషయం తనకు తెలియదని తెలిపా రు. ఈ సందర్భంగా
ఆర్జేసీ మాట్లాడుతూ భూమల అక్రమాలకు సంబంధించిందే కాకుండా, ఇతర ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటిపై విచారణ అనంతరం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
వాస్తవానికి తిరుపతి సమీపంలోని హథీరాంజీ మఠం భూములు గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతూ వస్తున్నాయి. వందల కోట్ల విలువైన మఠం భూముల్లో భూ మాఫియా తిష్ట వేసింది. దొంగ పత్రాలు సృష్టించి కాసులతో రిజిస్ట్రేషన్ అధికారుల కళ్లకు గంతలు కట్టి దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్నారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి మఠం భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూవచ్చారు. గత ప్రభుత్వ హయాంలో భూ మాఫియా స్వాహా చేసిన మఠం మఠం భూముల విలువ రూ. 100 కోట్లు పై మాటేనని సమాచారం.
*చిత్రం... అర్జున్‌దాస్‌