రాష్ట్రీయం

కల్యాణ వైభోగమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి : ముల్లోకాలకు అధిపతి ఆదిభిక్షువు... జగద్గురువు అయిన శ్రీ కాళహస్తీశ్వర సమేత జ్ఞాన ప్రసూనాంబ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 3గంటల ప్రాంతంలో కల్యాణోత్సవ ఘట్టం ముగిసింది. రథోత్సవం, తెప్పోత్సవం పూర్తయిన మరునాడు స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. దీనే్న స్కందరాత్రిగా పిలుస్తారు. శివరాత్రి మహోత్సవం అర్థరాత్రిపైన సోమస్కందమూర్తిని, అమ్మవారిని వివాహానికి సిద్ధంచేశారు. అలంకార మండపంలోస్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అత్యంత వైభవం అలంకరణలు పూర్తిచేశారు.
వివాహ మహోత్సవానికి స్వామివారికి, అమ్మవారికి అపురూపమైన బంగారు ఆభరణాలను పట్టువస్త్రాలతో సిద్ధంచేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా స్వామివారిని గజవాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై అధిష్టింపచేసి కల్యాణ వేదిక అయిన పెండ్లిమండపం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఎదురెదురుగా ఉంచి వివాహమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చతుర్వేదాలతో వేదపండితులు మంత్రోచ్ఛారణలతో కల్యాణవేదిక మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు సప్తపది, గౌరీపూజ, మాంగల్యపూజలు జరిపారు. పర్వతరాజైన హిమవంతుని కుమార్తె, పార్వతీదేవికిని, సోమస్కందమూర్తికి ఇచ్చేందుకు పర్వతరాజు ఎంతకీ ఒప్పుకోడు. శ్మశానంలో బూడిదపూసుకొని తిరుగుతున్న వ్యక్తి తన బిడ్డను ఏ విధంగా ఇవ్వాలని వాదనకు దిగుతాడు.
దీంతో వివాహం సందేహమవుతుంది. దీంతో వివాహమహోత్సవ భారాన్ని దేవతలు చండికేశ్వరుడికి అప్పగిస్తారు. ఆయన పర్వతరాజుతో రాయబారం నిర్వహిస్తాడు. ఈ సందర్భంగా చండికేశ్వరుడు శివుని లీలా విషయాలను పర్వతరాజుకు వివరిస్తాడు. అంతేకాకుండా పలుమార్లు చండికేశ్వరుడు రాయబారం నిర్వహిస్తాడు. ఈ సందర్భంగా నిర్వహించిన రాయబార ఘట్టాన్ని అర్చకులు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పలుమార్లు చండికేశ్వరుడు తిరిగి వెళ్లిపోవడం, తిరిగి రావడం, పార్వతీదేవిని ఇవ్వనని చెప్పే విషయాన్ని స్వామివారికి నివేదించారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవ ఘట్టంలో ఇది ఎంతో ప్రధాన కార్యక్రమం. అనంతరం ఎట్టకేలకు పర్వతరాజు వివాహానికి అంగీకరిస్తాడు.
కల్యాణోత్సవ మహోత్సవాన్ని వేదపండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. మేళతాళాలు, మంగళహారతులు, భక్తుల హర్షాతిరేకల మధ్య మాంగళ్యధారణ మహోత్సవం జరిగింది. ఈ వివాహ మహోత్సవం సందర్భంగా 30 మంది నూతన వధూవరులు స్వామివారికి కల్యాణోత్సవం వివాహ మహోత్సవంతో ఒక్కటయ్యారు. అనంతరం తలంబ్రాలు, నైవేద్య కార్యక్రమంతో ఉత్సవం ముగిసింది. స్వామి, అమ్మవార్లను వాహనంపై నేరుగా బేరివారి మండపం నుంచి ఆలయానికి తరలించారు.

*చిత్రం... శ్రీకాళహస్తిలో ఆదిదంపతుల కల్యాణోత్సవం