రాష్ట్రీయం

హైదరాబాద్‌కు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 27: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం నుంచి గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. గురువారం విజయనగరంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విజయవాడ (మంగళగరి) నుంచి ఉద యం 11.15 గంటలకు విశాఖపట్నం చేరుకున్నారు. మూడు రాజధానులపై జరుగుతున్న రగడ రాజుకున్న సందర్భంలో చంద్రబాబు విశాఖపట్నం పర్యటన ఏర్పాట్లపై ముందు నుంచి అదోళన జరుగుతాన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉద యం విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబును ఎయిర్‌పోర్టులోనే పలు స్వచ్ఛంద సంస్థలు, విశాఖ మేథావుల సంఘం, స్థానిక ప్రజలతో పాటు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో దాదాపు నాలు గు గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. ఇటు వైసీపీ అటు టీడీపీ పార్టీ నేతల మధ్య వాగ్వాదాలు, తోపులాట మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాల సముదాయించాడనికి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరికి
చంద్రబాబును అరెస్టు చేశారు. విశాఖలో ఇరువర్గాలు మోహరించడంతో విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబుని అరెస్టు చేసి ఎయిర్‌పోర్ట్ వీవీఐపీ లాంజ్‌లోనే కూర్చోబెట్టారు. గురువారం రాత్రి 8 గంటలకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబును విమానం ఎక్కించారు. రాత్రి 9.14 గంటలకు చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అంతకు ముందు హుటాహుటిన హైదరాబాద్ నుంచి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి విశాఖపట్నం చేరుకుని భర్త చంద్రబాబును పరామర్శించిన అనంతరం ఇద్దరూ కలసి హైదరాబాద్ చేరుకున్నారు.