రాష్ట్రీయం

మన ఇల్లు-మన వీధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: మన ఇల్లు, మన వీధి, మన పట్టణం అనే భావనతో ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖల్లో మార్పు రావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో పర్యిటించారు. 25లక్షలతో నూతనంగా నిర్మించిన పార్కును ప్రారంభించి మొక్కలు నాటిన అనంతరం మాట్లాడుతూ విదేశాల్లో రోడ్డుమీద చెత్త వేస్తే జరిమానా విధిస్తారని, మన దగ్గర ఆ పరిస్థితి లేదన్నారు. అయినా స్వచ్ఛందంగా ఎవరికి వారు పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం మనం పందులు, కుక్కలు, కోతులతో సహజీవనం చేస్తున్నామని, చెట్టతో మాత్రమే జీవనం సాగించే పరిస్థితి ఉండాలన్నారు. పట్టణంలో ఉత్పన్నం అవుతున్న చెత్త సేకరణకు వాహనాలు కొనుగోలు చేసుకోవాలన్నారు. ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారులను నియమించి పట్టణప్రగతిని పర్యవేక్షించాలన్నారు. అభివృద్ధి జరగకపోతే వార్డు సభ్యులను తొలగించడం పెద్దవిషయం కాదని, కొత్త మున్సిపల్ చట్టంతో అది మరింత సులభమైందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చేపట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయని, పట్టణప్రగతితో పట్టణాలు కూడా అ విధంగా మారాలన్నారు. అయితే ప్రజల సహకారం తక్కువగా ఉంటున్నదని, అది మరింత పెరిగేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పట్టణంలోనూ ప్లాస్టిక్ నివారణ, వీధి లైట్లు, తాగునీరు, వైకుంఠధామాలు కచ్చితంగా ఉండాలని, వీటి అమలుకు వార్డు కమిటీలను నియమించుకోవాలన్నారు.
*చిత్రం... మాట్లాడుతున్న పువ్వాడ