రాష్ట్రీయం

కేంద్ర నిధులు దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ గురువారం నాడు నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ల గురించి విస్తృంతగా మాట్లాడారు. గత ఎనిమిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై రాజీలేని పోరాటాన్ని బీజేపీ మాత్రమే చేసిందని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఉద్యమించామని , నిరవధిక దీక్ష చేపట్టామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బేషజాలకు పోయిందని, రాష్టప్రతి దృష్టికి ఈ అంశాన్ని తీసుకుపోవడంతో రాష్టప్రతి భవన్ మొట్టికాయలతో దిగివచ్చిందని, ఈ పరిణామాల అనంతరమే విద్యాశాఖ మంత్రి మారిపోయారని, గ్లోబరీనా సంస్థను తప్పించారని పేర్కొన్నారు. యాదాద్రి ఆలయంలో శిల్పాల విషయంలోనూ వివాదం జరిగిందని కేసీఆర్ ముఖం కొట్టొచ్చేలా కనిపించేట్టు చూశారని, కారు గుర్తును, చార్మినార్ ఫోటోను కూడా ముద్రించాలని చూస్తే బీజేపీ అడ్డుకుందని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుని నదుల అనుసంథానం పేరుమీద లక్ష కోట్లతో చేపట్టాలని చూస్తే ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, ఇది కేవలం దురుద్ధేశ్యంతో కాంట్రాక్టర్లు జోబులు నింపడానికే అని చెప్పామని పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా బీజేపీ బాసటగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యపరిచామని , ఢిల్లీ వరకూ ఈ పోరాటాన్ని తీసుకువెళ్లడంతో ఢిల్లీ హెచ్చరికలతో సీఎం దిగివచ్చారని అన్నారు. వెంటనే ఉద్యోగులను పనిలోకి తీసుకుని వారి పదవీ విరమణ వయస్సును కూడా పెంచారని, దీనికి కారణం బీజేపీ ఉద్యమమేనని చెప్పారు. ప్రభుత్వ చెలగాటానికి ఎప్పటికపుడు దీటుగా ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ నిలుస్తూ ఎప్పటికపుడు ఉద్యమాలు చేపట్టామని అన్నారు. క్షేత్ర స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ చేరికలు కొనసాగుతున్న ఏకైక పార్టీ బీజేపీయేనని అన్నారు. కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉందా అనే రీతిలో అదృశ్యమైందని చెప్పారు. ప్రజలు నమ్మి 19 మంది కాంగ్రెస్ సభ్యులను గెలిపిస్తే 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరారని, అలాంటపుడు కాంగ్రెస్‌ను వారిని గెలిపించడం ఎందుకనే భావన ప్రజల్లో వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఉందా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. నరేంద్రమోదీ అజెండాను చూసి సహించలేక మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ చూస్తోందని అన్నారు. సీఏఏ తర్వాత ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోయిందని అన్నారు. దేశం అభివృద్ది సంక్షేమంతో పాటు అనేక అంశాలకు వివిధ రూపాల్లో ప్రధాని చట్టాబద్ధతను కల్పించారని చెప్పారు. కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడిన రామమందిర సమస్యకు కూడా పరిష్కారం దొరికిందని అన్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని లక్ష్మణ్ చెప్పారు. మెజార్టీ కేంద్ర మంత్రులు ఈ ప్రభుత్వ అవినీతిపైనా, కుటుంబ పాలనపైనే మాట్లాడారని, అమిత్‌షా సైతం నేరుగా చెప్పారని తెలిపారు.

'చిత్రం...మీట్ ద ప్రెస్‌లో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్