తెలంగాణ

నేటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ ‘విజయసంకల్పం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంకల్ప శిబిరాన్ని ఈ నెల 24 నుండి 26 వరకూ భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నట్టు ప్రాంత సంఘ్‌చాలక్ బి దక్షిణామూర్తి, ప్రాంత కార్యవాహ కంచం రమేష్‌లు తెలిపారు. సోమవారం నాడు వారు కేశవనిలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో శాఖ ముఖ్య శిక్షకులు ఆ పైస్థాయి బాధ్యులు 8వేల మంది పాల్గొంటారని అన్నారు. 1925లో ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ 2024 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోందని వారు చెప్పారు. దాంతో మరింత వేగంగా కార్యవిస్తరణ చేసుకోవాలని సంఘ్ సంకల్పించిందని వారు పేర్కొన్నారు. తెలంగాణలో ఏడు దశాబ్దాలుగా విస్తరించిన సంఘ్ కార్యం గత ఏడాది కాలంలో మరింత విస్తరించిందని అన్నారు. 2018 నాటికి మొత్తం శాఖల సంఖ్య 2106, 2019 నాటికి ఆ సంఖ్య 3494కు పెరిగిందని అన్నారు. 2018 నాటికి 826 మండలాల్లో ఉన్న సంఘ్ కార్యం 2019 నాటికి 69 శాతానికి పెరిగిందని అన్నారు. ఇక నగరాల్లో 2018 నాటికి మొత్తం 1437 బస్తీల్లో 47 శాతం ఉన్న శాఖలు 2019 నాటికి 69.5 శాతానికి పెరిగాయని చెప్పారు. ఆర్ధిక స్థితిగతులు, సామాజిక హోదా తారతమ్యాలు లేకుండా సాధారణ కార్యకర్త నుండి రాష్టస్థ్రాయి, దేశ స్థాయి బాధ్యతలున్న వారు అంతా పాల్గొంటున్న దివ్యమైన శిబిరమని అన్నారు. శిబిరంలో పాల్గొనే 8వేల మందితో పాటు మరో వెయ్యి మంది వీరికి సహకారం అందిస్తారని, మార్గదర్శనానికి మరో 250 మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా 110 ఎకరాల జోగులాంబ నగరం, యాదాద్రి నగరం, భద్రాద్రి నగరం, సమ్మక్క సారలమ్మ నగరం, భాగ్యలక్ష్మి నగరం అని ఐదు నగరాలుగా తీర్చిదిద్దామని అన్నారు. ప్రతి నగరం నుండి ఆయా ప్రాంతాల నుండి వచ్చే 1500 నుండి 2500 మంది స్వయం సేవకుల బసతో పాటు భోజన, సభా ప్రాంగణాలుంటాయని వివరించారు. అన్ని నగరాలకు కలిపి సామూహిక కార్యక్రమాలు నిర్వహించడానికి మరో పెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆటలు, పథ సంచలన అభ్యాసం, శారీరక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పెద్ద సభాస్థలం ముస్తాబైందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఇలా ఉంటుందా ఈ రోజుల్లో కూడా ఇంతటి అనుశాసనం, క్రమశిక్షణ, దేశభక్తి ఉన్న వ్యక్తులు ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నారా అని ఈ శిబిరం చూసే పౌరులు కూడా ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం సరూర్‌నగర్‌లో స్టేడియంలో జరిగే సార్వజనిక ఉత్సవానికి అందరూ ఆహ్వానితులేనని అన్నారు. సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారని చెప్పారు. సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో దేశభక్తి భావాలను జాగృతపరచడంలో సంఘ్ సఫలీకృతం అవుతోందని అన్నారు. సంఘ్ ప్రేరణతో స్వయం సేవకులు 1.50 లక్షలకు పైగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ, అస్పృశ్యత నిరావరణకు, పర్యావరణ పరిరక్షణకు పనిచేస్తున్నారని వివరించారు. ప్రతి మూడేళ్లకోమారు జిల్లా లేదా విభాగ్ స్థాయిలో హేమంత శిబిరాలు జరుగుతుంటాయని, అయితే ఈసారి శాఖ ఆ పైస్థాయి కార్యకర్తలకు మూడు రోజుల పాటు ఈ ప్రాంత శిబిరాలను నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమాలకు సియంట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
'చిత్రం... పాత్రికేయులతో మాట్లాడుతున్న సంఘ్‌చాలక్ బి.దక్షిణామూర్తి, ప్రాంత కార్యవాహ కంచం రమేష్