రాష్ట్రీయం

గ్రేటర్ రాయలసీమలోనే ఆంధ్ర రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ రాయలసీమవాసులు తెలుగు వారి ఐక్యతకు చేసిన త్యాగాలను గుర్తించి, వారి మనోభావాలకు అనుగుణంగా గ్రేటర్ రాయలసీమకు రాజధానిని సిఫార్సు చేస్తారని విశ్వసిస్తున్నట్లు ఆ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సమర్పించిన వినతిపత్రంపై మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ శైలజానాథ్, ఆర్ చెంగారెడ్డి, కే మదన మోహన్ రెడ్డి, కే మధుసూదన గుప్తా, డాక్టర్ వీ శివరామకృష్ణారావు, మాజీ డీజీపీలు ఆంజనేయ రెడ్డి, దినేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. తాము రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి వినతిపత్రం పంపినట్లు వారు చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జీఎన్ రావు కమటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులు రెండు నివేదికలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయాలని వారు కోరారు. ఈ కమిటీలో గ్రేటర్ రాయలసీమకు చెందిన ముగ్గురు మంత్రులు ఉన్నారు. మిగతా వారు ఆంధ్రాప్రాంతానికి చెందిన వారున్నారు. గ్రేటర్ రాయలసీమ వాసులు తెలుగువారి ఐక్యతకు చేసిన త్యాగాలను గుర్తించి, వారి మనోభావాలకు అనుగుణంగా ఒక్కటిగా సీమకు రాజధానిని సిఫార్సు చేయాలని వారు కోరారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారు ప్రత్యేక రాష్టంగా
కావాలని విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. విశాలమైన తెలుగు వారి సఖ్యత కోసం ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిని గ్రేటర్ రాయలసీమ వాసులు త్యాగం చేశారని వారు పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణానికి దాదాపు 80 వేల ఎకరాల సాగుభూమిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా త్యాగం చేశారన్నారు. ఈనాటికీ భూసేకరణ కింద చెల్లించాల్సిన నష్టపరిహారం సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని వారు అన్నారు. త్యాగాలకు ఒక హద్దు ఉంటుందన్న విషయాన్ని హైపవర్ కమిటీ గమనంలో ఉంచుకుని సిఫార్సులు చేయాలన్నారు. త్యాగాలు, మనోభావాలు, ఆత్మగౌరవం, హక్కులు లాంటి పదాలకు జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ గ్రూపు కన్సల్టెన్సీ లాంటి కమిటీల నిఘంటువుల్లో అర్థాలు ఉండవన్నారు. ప్రజల నుంచి వచ్చిన వారు మాత్రమే ఆ పదాలకు అర్థాలు, పర్యవసానాలు అవగతం చేసుకోగలరని వారు అన్నారు. గ్రేటర్ రాయలసీమ వాసులు చేసిన త్యాగాలు కాలరాయకుండా గతంలో ఉన్న రాజధానిని గ్రేటర్ రాయలసీమలో పునరుద్ధరించాలని సిఫార్సు చేయాలని వారు కోరారు.