రాష్ట్రీయం

విశాఖ దక్షిణ తీర రైల్వే జోన్‌లో ఏప్రిల్ నుంచి కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అధికారికంగా రైల్వే కార్యాలయాలు విశాఖపట్నంలో పని చేయాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర కు దక్షిణ మధ్య రైల్వే జోన్ (సికింద్రాబాద్) కమర్షియల్ విభాగానికి ఆదేశాలు అందా యి. దీంతో ఇక విశాఖపట్నం దక్షిణ తీర రైల్వే జోన్‌గా పరిగణించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను కేంద్రం విభజించింది. విభజనలో భాగంగా విశాఖపట్నం డివిజన్ ను దక్షిణ తీర రైల్వే జోన్‌గా మార్చుతూ రైల్వే బోర్డుగా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలో కార్యాలయాల వౌలిక వసతుల కోసం కేంద్రం రూ.120 కోట్లను విడుదల చేసింది. తక్షణం ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ను వేగవంతం చేయాలని
రైల్వే బోర్డు ఆదేశాల్లో స్పష్టంగా సూచించింది. ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు విశాఖపట్నం వెళ్లడానికి ఆదేశాలు జారీ చేయాలని సూచించింది. ఉద్యోగులను బలవంతంగానైనా బదిలీ చేయాల్సిందిగా రైల్వే ఉన్నతాధికారులకు వౌఖిక ఆదేశాలు వచ్చాయి. దీంతో సంక్రాంతి తర్వాత ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి వెల్లడించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లో దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారని, అందులో 50 శాతం ఉద్యోగులు బదిలీ అవుతున్నారని ఆయన అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని అన్ని విభాగాల్లో పైస్థాయి నుంచి నాలుగవ తరగతి ఉద్యోగులను బదిలీ చేస్తున్నారు. ఉద్యోగుల అభ్యర్థనకు ఎలాంటి అవకాశాలు ఇవ్వవొద్దని ఖచ్చింతగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 20వ తేదీ తర్వాత కొంతమంది సీనియర్ అధికారులు తాత్కాలిక కార్యాలయాలను ఎంపిక చేయడానికి విశాఖపట్నం బయలుదేరనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న దక్షిణ తీర రైల్వే జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉండబోతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆయా డివిజన్లు విశాఖపట్నం జోన్ పరిధిలో పని చేస్తాయి. సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు పనిచేస్తాయి.