ఆంధ్రప్రదేశ్‌

పోలీసు రిక్రూట్‌మెంట్‌లో సమూల మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 5: పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సమూలంగా మార్చివేయనున్నట్లు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విభజన అనంతరం హోంశాఖలో ఏర్పడిన ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు చాలావరకూ ఖాళీగా ఉన్నాయన్నారు. వాటి భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందు పరీక్షా విధానం, ట్రైనింగ్ పద్దతులకు సంబంధించిన మాన్యువల్ పారదర్శకంగా ఉండేటట్టు హోంశాఖ కార్యాచరణ రూపొందించిందన్నారు. ఎంపిక అనంతరం శారీరక ధారుడ్యంతో పాటు మేథస్సుకు పదునుపెట్టేలా సరికొత్త శిక్షణ విధానాన్ని అమలుచేయనున్నామన్నారు. సామాన్యులు పోలీసుఠాణాలకు వెళ్ళకుండా ఫిర్యాదు చేసేలా ఆన్‌లైన్ విధానాన్ని అవలంభించినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.సరికొత్త ‘కంప్లైయింట్ యాప్’ రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. రంగా విగ్రహాన్ని నేలకూర్చిన దుండగులు ఎవరైనా శిక్ష తప్పదన్నారు.ఎస్సీ, ఎస్టీ, మహిళాకేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేకంగా డిఎస్పీలను నియమించామాన్నారు.

కదిరి ఎమ్మెల్యే కారుపై దాడి

నిరసనగా వైకాపా రాస్తారోకో

కదిరి,ఏప్రిల్ 5: అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా(వైకాపా) కారుపై సోమవారం రాత్రి తలుపుల మండల కేంద్రంలో దాడి జరిగింది. దాడి సమయంలో ఎమ్మెల్యే అత్తార్ కారులోలేరు. సంఘటనలో కారు అద్దాలు మాత్రం ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. కదిరి నియోజక వర్గంలోని తలుపుల మండల కేంద్రంలో జరుగుతున్న ఉరుసు కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం సోమవారం రాత్రి 10 గంటల దాటిన తరువాత ఎమ్మెల్యే వెళ్లారు. అక్కడ ఉరుసు కార్యక్రమంలో పాల్గొని కారును సమీపంలోనే రోడ్డు పక్కన నిలిపి, అక్కడే భోజనం చేసి, తిరిగి కారు వద్దకు రాగా, ఎమ్మెల్యే కూర్చొనే వైపు అద్దం ధ్వంసమైనట్టు గుర్తించారు. ఎవరో గుర్తు తెలియని దుండగులు పెద్ద బండరాయితో దాడి చేసినట్టు గుర్తించారు. బండరాయి కూడా అక్కడే పడి వుంది. వెంటనే ఎమ్మెల్యే చాంద్ బాషా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెల్లి ఫిర్యాదు చేశారు. అంతేగాక జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబుకు సైతం ఫోన్ చేసి, జరిగిన సంఘటనను వివరించారు. ఇందుకు ఎస్పీ స్పందిస్తూ కదిరి డిఎస్పీ వెంకట రామాంజనేయులుకు ఫోన్ చేసి, జరిగిన సంఘటనను తీవ్రంగా పరగిణించి నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా అత్తార్ చాంద్ బాషా 2014 ఎన్నికల్లో కదిరి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాలుగు నెలలకే తలుపుల మండలం ఇందుకూరుపల్లికి చెందిన ఒక వ్యిక్తి అత్తార్‌కు ఫోన్ చేసి, నెల లోపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని,లేని పక్షంలో నీ అంతు చూస్తానని బెదిరించడం తెలిసిందే. ఇందుకు సంబంధించి తలుపుల మండల కేంద్రంలో అప్పట్లో కేసు సైతం నమోదు చేశారు. తిరిగి అదే మండలంలో ఎమ్మెల్యే కారుపై దాడి జరగడం, పైగా ఎమ్మెల్యే కారులో కూర్చొనే వైపుఅద్దంపై బండరాయితో దాడి చేయడం గమనార్హం. ఇందుకు నిరసనగా మంగళవారం తలుపుల మండల కేంద్రంలో వైకాపా నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు రాస్తారోకో చేసి నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.