ఆంధ్రప్రదేశ్‌

చదువుల తల్లి నాగలక్ష్మికి సంపూర్ణ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం కెజిబివికి చెందిన బధిర విద్యార్థిని నాగలక్ష్మి పదో తరగతిలో జిపిఎ 10కి 10 సాధించిన నేపథ్యంలో ఆమె ఉన్నత చదువులకు రాష్ట్రప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం ఆయన నాగలక్ష్మిని ఘనంగా సత్కరించారు. పుట్టుకతోనే మూగ, చెవిటి అయినా నాగలక్ష్మి కష్టపడి చదివి పదో తరగతి పరీక్షల్లో పదికి పది జిపిఎ సాధించిందని, పేదరికంతో మధ్యలోనే చదువు మానేసిన ఆ చిన్నారిని సర్వశిక్షా అభియాన్ అధికారులు గుర్తించి బ్రహ్మంగారి మఠం కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చేర్పించారని మంత్రి తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయులను ప్రత్యేకంగా నియమించి నాగలక్ష్మికి శిక్షణ ఇప్పించారు. దీంతో నాగలక్ష్మి పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించింది. ఈ విషయాన్ని గమనించిన మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం నాగలక్ష్మిని హైదరాబాద్ పిలిపించుకుని అభినందించారు. ఆమెకు జ్ఞాపికను బహుకరించి ఉన్నత చదువులకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ విబి.రమణమూర్తి ఆమెను స్వీకార్ ఉపకార్ పునరావాస కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. భవిష్యత్‌లో ఆమెకు ఆరోగ్యరీత్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌పి.సిసోడియా, కమిషనర్ కె.సంధ్యారాణి, కెజిబివి జెఎస్ కుమార్ , కడప జిసిడివో సునీత తదితరులు పాల్గొన్నారు.