మహబూబ్‌నగర్

శివోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగులాంబదేవి సన్నిధిలో ఎస్పీ విశ్వప్రసాద్
అలంపూర్, మార్చి 7: మహశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో శివాలయాలు శివనామస్మరణం మారుమోగింది. భక్తులతో కిటకిటలాడాయ. దక్షిణకాశి శ్రీ జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా ఎస్‌పి విశ్వప్రసాద్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయ పద్ధతిలో ఇఓ గురురాజ, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబదేవి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. ఆయనతో పాటు డిఎస్‌పి బాలకోటి, సిఐ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

శివ నామస్మరణతో మార్మోగిన మాణిక్యగిరి
దివ్య దర్శనమిచ్చిన మాణికేశ్వరిమాత * తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు
నారాయణపేటటౌన్, మార్చి 7: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యానగుంది మాణిక్యగిరి పుణ్యక్షేత్రం శివనామః స్మరణతో మార్మోగింది. మాణిక్యగిరి క్షేత్రంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని మాణికేశ్వరి మాతను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మాణికేశ్వరి మాత తన దివ్య దర్శనాన్ని అందించడంతో భక్తులు పులకించారు. నారాయణపేట డివిజన్ సరిహద్దు కర్నాటక రాష్ట్రం సేడం తాలుకా యానగుంది గ్రామంలో గల మాణిక్యగిరిపై వెలసిన రూప రహిత అహింసో పరమోధర్మః వీరధర్మజ మాణికేశ్వరి మాత ప్రతి శివరాత్రి పర్వదినాన వౌనదీక్షలో తన దివ్యదర్శనాన్ని భక్తులకు అందించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ఉదయమే మాణికేశ్వరిమాత తన దివ్యదర్శనాన్ని అందించనుందని మాణికేశ్వరి ట్రస్టు సభ్యులు ముందుగా ప్రకటించడంతో తెలంగాణ, ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ తదితర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు ఆదివారం రాత్రి నుండే మాణిక్యగిరికి చేరుకున్నారు. అమ్మవారి దివ్యదర్శనం కోసం ఒకటిన్నర గంటల వరకు వేచి చూడగా 12.30గం. వరకు వేచిచూడగా అమ్మవారు ఇరవై నిమిషాల పాటు తన దివ్యదర్శనాన్ని అందించారు. కాగా సూర్యనంది క్షేత్రం వెనక వైపు నుండి అమ్మవారు తన దివ్యదర్శనాన్ని భక్తులకు అందించడంతో భక్తులు ఓం నమ శివాయః నామస్మరణతో సూర్యనంది క్షేత్రాన్ని మార్మోగించారు. అంతకు ముందు మాణిక్యగిరిపై వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి, శివాలయం, భ్రమరాంబికా దేవాలయం, మహా విష్ణు, నవగ్రహాలను దర్శించుకున్నారు. కాగా ఈ ఉత్సవాలకు హాజరైన భక్తుల సౌకర్యార్థం మాణిక్యగిరి ట్రస్టు సకల ఏర్పాట్లు చేసింది. భక్తులకు భోజనం, మంచినీటి వసతి కల్పించి తమవంతు సహాయం అందించారు. కాగా ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో ట్రాఫిక్‌ను అదుపులో పెట్టేందుకు కర్నాటక పోలీసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ప్రత్యేక బస్సులు
యానగుందిలోని మాణిక్యగిరి క్షేత్రంపై వెలసిన మాణికేశ్వరి మాత దివ్యదర్శనానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆంధ్ర, కర్నాటకకు చెందిన ఆర్టీసీ యానగుందికి ప్రత్యేక బస్సులను నడిపించింది. నారాయణపేట డిపో బస్సులు నారాయణపేట, కోస్గి, కొడంగల్ నుండి తిరగగా, యాద్గిర్ బస్సులు, యాద్గిర్, గుర్మిట్‌కల్, సేడం బస్సులు సేడం, ముధోళ్ తదితర ప్రాంతాల నుండి తిరిగాయి. దాంతో పాటు ప్రైవేటు వాహనాలు సైతం పెద్ద సంఖ్యలో ప్రయాణీకులను చేరవేశాయి.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
ఆ దైవత్వంతో భక్తుల తిరుగుపయనం
బొంరాస్‌పేట, మార్చి 7: పోలేపల్లి ఎల్లమ్మ దేవత దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు దర్శనమిచ్చిన ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు సోమవారం ముగిసాయ. ఐదు రోజులు అత్యంత వైభవంగా సాగిన ఉత్సవాలు ముగియడంతో గ్రామంలోని తన ఆలయానికి తిరుగు ప్రయాణమైంది. జాతర ప్రారంభం రోజు అమ్మవారిని తీసుకు వచ్చిన విధంగానే చివరి రోజైన సోమవారం రేణుక ఎల్లమ్మదేవతను భక్తులు సాగనంపారు. అమ్మవారు వెళ్ళగానే భక్తులు గుండెల నిండా నింపుకున్న దైవత్వంతో తిరుగు ప్రయాణమయ్యారు. మరిచిపోలేని మధురానుభూతులను నెమరేసుకుంటూ తమతమ ఇళ్లకు బయలుదేరారు. గత వారం రోజులుగా జనసంద్రంగా ఉన్న పోలేపల్లి ఒక్కసారిగా నిర్మానుష్యమయింది.
గ్రామస్థుల సందడి
ఐదు రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో చివరిరోజు పోలేపల్లి గ్రామ ప్రజలంతా జాతర ప్రాంగాణానికి చేరుకుంటారు. జాతర సందర్భంగా తమ ఇళ్లకు వచ్చిన ఆడపడుచులందరికీ గాజులు వేయించడం సంప్రదాయంగా ఉండటంతో సోమవారం గాజులు దుకాణాల్లో మహిళల కొనుగోళ్ల సందడి కనిపించింది. ఎద్దుల బండ్లపై వచ్చిన భక్తులు మూట ముల్ల్లె సర్దుకోవడం కనిపించింది. జాతర ఉత్సవాలు ముగియడంతో ఆలయ మేనేజరు రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి హుండీ లెక్కింపుచేయగా మూడు లక్షల తోమ్మిదివేల మూడువందల యాభై ఏడు రూపాయల ఆదాయంతో పాటు నాలుగువందల గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ మేనేజరు రాజేందర్‌రెడ్డి తెలిపారు.