కృష్ణ

కల్తీ మద్యం మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 8: విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందటం, 34 మంది అస్వస్థతకు గురైన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్ర్తి విముక్తి సంఘటన జిల్లా ఉపాధ్యక్షురాలు పామర్తి అంజమ్మ డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా మంగళవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మద్యం అమ్మకాలు, ఉత్పత్తులను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటరు నుండి కోనేరు సెంటరు వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా అంజమ్మ మాట్లాడుతూ కల్తీ మద్యం విక్రయించిన బార్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల బలహీనతలపై వ్యాపారం చేస్తూ రూ.12వేల కోట్లు ఆదాయాన్ని ఎక్సైజ్ ద్వారా గడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్చలవిడి మద్యం వ్యాపారంతో పాటు మరికొందరు కాసులకు కక్కుర్తి పడి కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన ఐదుగురి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రైతుకూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జగన్, జిల్లా నాయకులు కె నాగేశ్వరరావు, ఎఐఎఫ్‌టియు(న్యూ) నాయకులు సుధాకర్ పాల్గొన్నారు.