రాష్ట్రీయం

వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం : సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు, భార్య సునీలా గజపతిరాజు, సుధా గజపతి రాజు, మాజీ ఎంపీ ప్రదీప్‌ చంద్రదేవ్‌ తదితరులు స్వామివారి తొలి దర్శనాన్ని చేసుకున్నారు.
టీటీడీ ఈవో అశోక్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, డాలర్‌ శేషాద్రి... స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సింహాద్రి అప్పన్నకు చందనం, పట్టువస్త్రాలు సమర్పించగా, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి ఈఓ పద్మ పట్టువస్త్రాలు అందచేశారు. ఇక ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కుటుంబీకులు, హోంమంత్రి చినరాజప్ప, ఆయన కుటుంబసభ్యులు మంత్రి గంటా కుటుంబీకులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారు.