గ్రహానుగ్రహం

రైట్ బ్రదర్స్ (ప్రముఖ శాస్తవ్రేత్తలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విల్సన్ రైట్, ఆర్విల్ రైట్ అనే సోదరులు అమెరికా దేశస్థులు. విల్సన్ ఇండియానా రాష్ట్రంలోని మిల్‌విల్ అనే పట్టణంలో 1867 ఏప్రిల్ 16, ఆర్విల్ ఒహాయ్ రాష్ట్రంలోని ‘పేటన్’ అనే పట్టణంలో 1871 ఆగస్టు 19న జన్మించాడు. వీరి తండ్రి మత ప్రవక్త. కుమారులకు కూడా ఇదే రంగంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ వారిద్దరికీ చిన్నప్పటి నుండీ యంత్రాల మీద, యంత్ర పరికరాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది.
కొత్తకొత్త యంత్రాలను, యంత్ర పరికరాలను కనిపెడుతున్న రోజులవి. అటువంటి తరుణంలో ఈ సోదరులిద్దరికీ విమానం కనిపెట్టాలనే ఆలోచన కలిగింది. సాధారణ చదువు అనంతరం సోదరులిద్దరూ ప్రింటింగ్ మిషను తయారుచేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అది కుదరలేదు. సైకిలును తయారుచేసి అందరి మెప్పు పొందారు. 1896లో విమాన పరిశోధనలకు రూపకల్పన చేస్తున్న సమయంలో జర్మనీ దేశానికి చెందిన అట్టోలైలింథల్ అనే శాస్తవ్రేత్త తయారుచేసిన గాలిలో ఎగిరే గ్లయిడర్ గురించి విన్నారు.
అప్పటికప్పుడే జర్మనీ వెళ్లి ఆ శాస్తవ్రేత్తను కలిసి ఆ గ్లయిడర్‌ను పరిశీలించారు. అందులోని లోపాలను కూడా తెలుసుకున్నారు. ఆ విధంగా ఆ ప్రయత్నంలో వారు చాలామంది శాస్తవ్రేత్తలను కలిసి తమ పరిశోధనలకు ఊపిరి పోసుకున్నారు.
1903వ సం. డిసెంబర్ 17న పెట్రోలుతో ఎగిరే తేలికపాటి విమానం తయారుచేయగలిగారు. విమాన రంగంలో నూతన అధ్యాయం అది. ‘రైట్ ఫ్లైయిర్’ అనే ఆ మొట్టమొదటి విమానం కిట్టీహాక్ అనే ప్రాంతంలో ఆనాడు గాలిలోకి ఎగిరి చరిత్ర సృష్టించింది.
అయితే కొందరు ఈర్ష్యాపరులు వీరి మీద పత్రికలలో తప్పుడు రాతలు రాయించారు. సోదరులిద్దరూ బాధపడినా మానవ జాతి సౌఖ్యం కోసం తమ ప్రయోగాలను వీడలేదు. ఎట్టకేలకు వారి కృషి ఫలించి రైట్ సోదరుల విమానాన్ని అందరూ ఆమోదించారు.
పెద్దవాడైన విల్సన్ రైట్ 1912వ సం.లో మరణించాడు. ఆర్విల్ రైట్ మాత్రం అనేక ప్రయోగాలతో నమోదు విమానాలను తయారుచేసి ప్రపంచానికి అందించాడు. ఎన్నో అవమానాలను పొందిన ఆర్విల్ తన మేధస్సుతో ప్రపంచం నివ్వెరపోయేలా విమాన సృష్టికర్తగా నిలిచి 1948 జనవరి 30న మరణించాడు.

-పి.వి.రమణకుమార్