బిజినెస్

విస్తరిస్తున్న బ్రిక్స్ ఇండస్ట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ, ఏప్రిల్ 30: భవన నిర్మాణాలకు అవసరమైన ఇటుకులను తయారు చేసే వ్యాపారులు పెట్టుబడులకు వెనుకంజ వేయకుండా డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రోజురోజుకు విస్తరింప చేస్తున్నారు. గతంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో తయారైన ఇటుకలను భవన నిర్మాణాలకు తెచ్చుకొనేవారు. ప్రస్తుతం ప్రతి మండలంలోనూ ప్రధాన రహదారికి అనుసరించి బ్రిక్స్ ఇండస్ట్రీ విస్తరిస్తోంది. డీ మోనటైజేషన్, ఎఫ్ ఆర్ డీ ఐ బిల్లు ప్రభావంతో ప్రజలు బ్యాంకుల్లో తమ వద్ద ఉన్న సొమ్మును డిపాజిట్ చేయకుండా పట్టణాల్లో స్థలాలు కొనుగోలు, ఇళ్ల నిర్మాణాలపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా ఎన్‌టి ఆర్ గృహ నిర్మాణాలు, మరుగుదొడ్లు నిర్మాణాలు, ఇతర కాంట్రాక్ట్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. దీంతో ఇతర భవన నిర్మాణ సామాగ్రీతో పాటు ఇటుకులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. గతంలో వర్షాకాలంలో తయారయ్యే ఇటుకలకు ఎక్కువగా ధర ఉండేది. గత ఏడాది వర్షాకాలంలో ట్రాక్టర్ ద్వారా వచ్చే రెండు వేల ఇటుకలు రూ.10,500కు విక్రయించేవారు. వర్షాకాలం తదుపరి శీతాకాలం, వేసవికాలంలో ఇటుకలకు డిమాండ్ తగ్గి ధర తగ్గుతుండేది. ఈ ఏడాది భవన నిర్మాణాల సంఖ్య పెరగడంతో వర్షాకాలంలో ఉన్న ధర కంటే ఈ వేసవిలో కూడా ఎక్కువై సుమారు 12 వేల రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇటుకను తయారీదారులు లబ్ధిదారులకు విక్రయిస్తున్నారు. కొన్ని దశాబ్ధాల క్రితం రైతులు తమ పొలాల్లో ఇటుకలను తయారు చేయించి సొంత కలప ఉపయోగించి కాల్చి భవన నిర్మాణాలకు వినియోగించేవారు. ప్రస్తుతం ఇది వ్యాపారంగా మారడంతో అనేక మంది పెట్టుబడిదారులు లైట్ వైట్ ఇటుకల పేరుతో ధరలు పెంచుకుంటూ పోతున్నారు. సంవత్సరాల తరబడి సరిపోయే మట్టిని సేకరించి రకరకాల ముడి పదార్థాలు అందులో కలిపి లైట్‌వైట్ ఇటుకను ధాన్యం పై పొర నుంచి వచ్చే ఊక సాయంతో కాల్చుతూ బట్టీలను తయారు చేస్తున్నారు. పాలకొండ, వీరఘట్టం, రేగిడి తదితర మండలాల్లో ప్రధాన రహదారికి అనుసరించి బ్రిక్స్ ఇండస్ట్రీ విస్తరించింది. వీటి తయారీలో అనేక మంది కూలీలు కూడా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇటుకల ధరలు అధికంగా ఉన్నప్పటికీ భవన నిర్మాణాలు జరిపేవారు తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేయాల్సి వస్తుంది.