క్రైమ్/లీగల్

క్వారీ నీటి బందలో పడి ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొందూరు, సెప్టెంబర్ 7: మండలం రాపాక గ్రామ పరిథిలో గల క్వారి నీటి బంద చెరువులో గురువారం రాత్రి పొందూరు మేజర్ పంచాయతీ కుమ్మరి కాలనీకి చెందిన వజ్జి పోలయ్య (49) పడి దుర్మరణం చెందారు. శుక్రవారం ఉదయం బందలో మృతుని శవం తేలియాడింది. చుట్టుపక్కల చూపరులు చూసి పోలయ్య మృత దేహంగా గుర్తించారు. స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే వజ్జి పోలయ్య యోగి జంగాల కులస్థుడు. పురవీధుల్లో గంట మోగిస్తూ భిక్షాటన చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మృతుడు భార్య మల్లమ్మ మూడు రోజుల క్రితం కన్నవారింట్లో ఉండే ఆధార్ కార్డ్‌ను తెచ్చి మార్చుకోవాలన్న ఉద్దేశ్యంతో ఊరికి వెళ్లే సమయంలో ఈ అఘాయిత్యం జరిగిందని బంధువులు లబోదిబో అంటూ కంటతడి పెడుతున్నారు. మృతునికి కోటమ్మ అనే 8 ఏళ్ల పాప, నగేష్ అనే రెండేళ్ల బాలుడు ఉన్నారు. తండ్రి మరణంతో అనాధలైన పిల్లల కన్నీటి ఘోష చూపరుల గుండె తరుక్కుపోయింది. కుటుంబాన్ని పోషించే భర్త మృత్యువు పాలవ్వడంతో భార్య మల్లమ్మ గుండెలు బాదుకుంటూ విలపించిన కన్నీటి ఘోష వర్ణతాతీతం. మృతునికి ఫిట్స్ అనేక పర్యాయాలు వస్తున్నా పట్టించుకోకపోవడంతోనే మృత్యువు వెంటాడిందని బంధువులు తల్లడిల్లుతున్నారు. ఘటనాస్థలానికి వచ్చిన ఎస్సై బాలరాజు ప్రోత్సాహంతో మృతదేహాన్ని వెలికి తీసారు. శవపంచనామా అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసును నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.