శ్రీకాకుళం

మానవత్వ రాజకీయాలే నాకు తెలుసు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఇరవై లక్షలకుపైగా ఓటర్లకు జవాబుదారీగా పనిచేసాను. ప్రజలే ముందు - రాజకీయాలు తర్వాత అన్న ఒకే సిద్ధాంతం నా రాజకీయ ప్రస్థానం. అందలమెక్కించిన ప్రజలను మరచి నేలవిడిచి సాముచేసే అధికారదర్పణం కాదు, సేవకుడులా పనిచేసే తత్వాన్ని నా తండ్రి దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు నుంచి నేర్చుకున్నాను. అందుకే, మానవత్వపు రాజకీయాలే నాకు తెలుసు. ఆ మార్గమే శ్రీరామరక్ష. అంటూ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కింజరాపు రామ్మోహన్‌నాయుడు పలికే తొలిపలుకులు. ఆయన మాటల్లోనే - అతి చిన్నవయస్సులో లోక్‌సభలో అడుగుపెట్టినప్పుడు ఎర్రన్న తనయుడిగా నమ్మకంతో 1,24,657 ఓట్లు మోజార్టీతో 2014 ఎన్నికల్లో గెలిపించిన జిల్లా ప్రజల కష్టనష్టాలు పార్లమెంటులో గొంతెత్తి చెప్పగలనా? అని అనిపించింది. కానీ, ఐదు కోట్ల ఆంధ్రుల గొంతును ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ కావాలంటూ తాను వినిపించినప్పుడు నా శక్తిసామర్థ్యాలు అర్థమయ్యాయి. అప్పుడే అనిపించింది గడచిన ఐదేళ్ళు ఎం.పి.గా శ్రీకాకుళం జిల్లాకు ఎంతో చేసినప్పటికీ, ఇంకా చేయాల్సింది ఉందని, అందుకు శక్తితనకు ఉందన్న విషయం అర్థమైంది. అందుకే రానున్న ఐదేళ్ళు పార్లమెంటు సభ్యుడుగా శ్రీకాకుళం జిల్లాలో ప్రతీ నియోజకవర్గం అభివృద్ధికి సైనికుడిలా పనిచేస్తాను. 2019 ఎన్నికలకు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి ఏకైక మానిఫెస్టో 3జయహో శ్రీకాకుళం2. అదే నా లక్ష్యం, కల. ఎర్రన్న ఆశయాలు, కలలను చిన్నవయస్సులోనే భుజం కాసినప్పటి నుంచి 3ఎర్రన్నతోనే పోటీ2 పడుతున్నాను. ముప్పైఏళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానం కింజరాపు కథ కాదని, సిక్కోల్ గాథ అంటూ అన్నీ వర్గాల ప్రజలు ఎం.పి.గా ఎన్నికైన తొలి రోజుల్లో నాన్నగారి సమకాలికులు, సన్నిహితులు, స్నేహితులు చెప్పే మాటల్లో నిగూఢ అర్థం వంటబట్టలేదు. కానీ, కొన్నాళ్ళు తర్వాత ఆయనతోనే పోటీ పడేలా నా రాజకీయ ప్రస్థానం మార్చేసింది. ఆయన ఆలోచనల నుంచి వచ్చిన జయహో శ్రీకాకుళం ప్రణాళికతో రానున్న ఐదేళ్ళలో చేసిన అభివృద్ధిని చూపించే 2024 ఎన్నికల్లో ఓటు అడిగేందుకు ప్రజల ముందుకు వెళ్తాను. ఇప్పటి వరకూ యువనేతగా అన్నీ అంశాల్లో అనుకున్నంత సాహాసోపేతమైన దూకుడు కనబరచలేకపోవడానికి కొన్ని సామాజిక, రాజకీయ హద్దులు తనను అడ్డుకున్నప్పటికీ, రానున్న ఐదేళ్ళను గడచిన అనుభవాలు నేర్పిన పాఠాలతో ఎర్రన్న ప్రజాసదన్ పూర్తిగా ప్రజాదర్భార్‌గా పనిచేస్తోంది. కులం, మతం, రాజకీయం వంటి ఎటువంటి ప్రలోభాలకు ఎం.పి. గ్రీవెన్స్‌లో చోటువుండదు. స్వతంత్ర నిర్ణయాలు, ప్రజల సమస్యలపై పోరాటాలే ప్రాధమిక బాధ్యతగా అడుగులు వేస్తాను. ఎర్రన్న కలల సాకారమే కర్తవ్యంగా పనిచేస్తాను. 2014 నుంచి ఇప్పటి వరకూ రూ. 1,028 పనులు పూర్తిచేయడం, ఆమోదించడం జరిగింది. ఎం.పి.నిధులు రూ. 27కోట్ల 22 లక్షల 11 వేల రూపాయలతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేసాను. 162 సామాజిక భవనాలు, ప్రజల కోరినవెంటనే కళావేదికలను నిర్మించాను. అనునిత్యం ప్రయాణించే మధ్యతరగతి ప్రజల సేదతీర్చుకునేలా 146 బస్సు షల్టర్లు ఏర్పాటు చేసాను. 228 సిసీ రోడ్లు వేసి గ్రామాలకు ప్రధాన రహదారులతో కనెక్టీవిటీ చేసాను. జిల్లాకు నాలుగు అంబులెన్స్‌లు పేదరోగుల కోసం ఇచ్చాను. జిల్లాలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, వౌలిక సదుపాయాలు కల్పించాను. రైల్వే జోన్ కోసం సుదీర్ఘ పోరాటం చేసి వాల్తేరు డివిజన్‌ను తొలగించడానికి నిరసనగా, ఖుర్థారోడ్డు పరిధిలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఏడు రైల్వే స్టేషన్లును కొత్తగా ఏర్పాటైన జోన్‌లో కలపాలని ఇచ్చాపురం రైల్వేస్టేషన్‌లో దీక్ష చేసాను. ఎర్రన్న చేపట్టగా మిగిలిన రైల్వే సేవలను పునరుద్ధగలిగించాను. అప్పుడు ఎర్రన్న కృషితో స్వర్ణచతుర్భజం ప్రాజెక్టుగా జిల్లాలో నాలుగులైన్ల హైవే నిర్మాణం జరిగింది. ఇప్పడు రణస్థలం నుంచి నరసన్నపేట వరకూ రూ. 1400 కోట్లతో ఆరులైన్లుగా విస్తరణ, అభివృద్ధికి కృషి చేసాను. విద్యారంగాన్ని విశాలదృక్పథంతో ముప్పైఏళ్ళ ముందుచూపుతో నైర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జాతీయ వరి పరిశోధనకేంద్రంగా నెలకొల్పేందుకు కృషి చేసాను. సాంకేతికవిద్యలో ముందుంచాలని త్రిపుల్ ఐ.టి. కోసం కష్టపడ్డాను. పది మండలాల్లో 80 పాఠశాలలకు డిజిటల్ తరగతులు అందించాను. భారతసంచార్‌నిగమ్ సంస్థ ద్వారా 81 చోట్ల వైఫై సౌకర్యాల కోసం హాట్‌స్పాట్‌లు అమర్చేలా చర్యలు తీసుకోగా, 4జీ సర్వీసులు జిల్లాలో ప్రారంభించేందుకు కృషి చేసాను. గడచిన ఐదేళ్ళలో 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు కల్పించి రెండుపంటలు పండేలా ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాం. 27 ఎత్తిపోతల పథకాలతో అన్నదాతకు సాగునీటి కష్టాలు తీర్చాం. వంశధార, ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు శరవేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నాం. కనె్నధారకొండ లీజును రద్దుచేయడమేకాకుండా, సోంపేట థర్మల్‌పవర్‌ప్లాంట్‌కు ఇచ్చిన భూమి రద్దు చేయించి ప్రజల కోర్కెను తీర్చగలిగాం. దీన్‌దయాళ్ గ్రామజ్యోతి పథకం ద్వారా రూ. 177 కోట్లుతో జిల్లాలో విద్యుత్‌వెలుగులు వెలిగించాను. పట్టణాభివృద్ధితోపాటు, పర్యాటకు అభివృద్ధి చేసాను. ఉద్దానం కిడ్నీరోగులకు విశేష సేవలు అందేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రప్పించాను. ఇలా గడచిన ఐదేళ్ళలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ పనులు చేసిన సంతృప్తి ఉంది. మరోసారి సిక్కోల్ ప్రజలంతా దీవించి, ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ నాగమణి సస్పెన్షన్
* మద్యం విక్రయాలు పెరగడం, సారా సరఫరా *ఎన్నికల అధికారి జనార్థన్ నివాస్ ఉత్తర్వులు

శ్రీకాకుళం, ఏప్రిల్ 9: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన శ్రీకాకుళం ఎక్సైజ్ స్టేషన్ హౌస్ అధికారిణి బి.నాగమణిని సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జనార్థన్ నివాస్ ఉత్తర్వులు జారీ చేసారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించడం తద్వారా మద్యం విక్రయాలు పెంచడం, సారాయిని అరిక్టడంలో విఫలం చెందారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. మద్యం విడి విక్రయాలు (లూజు) అధికం కావడంలోను, మద్యం దుకాణాలపై నియంత్రణ లేకపోవడం, తనిఖీల లోపం, ఏ4 మద్యం దుకాణాలు, 2బి బార్‌లపై కేసులు నమోదు చేయకపోవడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని అన్నారు. అనధికారికంగా మద్యం నిల్వలు పెరుగుటకు కారణమయ్యారని లైసెన్సుదారులతో కుమ్మక్కాయనరని అభిప్రాయం వ్యక్తం అయిందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోను ముందస్తు అనుమతి లేకుండా సెలవులు వినియోగించుకోవడం, ప్రధాన కార్యాలయం విడిచి వెళ్ళడం, ఆకస్మిక తనిఖీలు నిర్వహించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఉత్తర్వులను ఎస్.హెచ్.వో.కు అందించినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తెలిపారు.

పార్లమెంటు అభ్యర్ధుల వ్యయ పరిశీలన

శ్రీకాకుళం, ఏప్రిల్ 9: పార్లమెంటు అభ్యర్ధుల వ్యయంపై రికన్సిలేషన్ కార్యక్రమం మంగళవారం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ జనార్థన్ నివాస్, మరియు పార్లమెంటు వ్యయపరిశీలకులు, ఆడిట్ అధికారుల సమక్షంలో పార్లమెంటు అభ్యర్ధుల వ్యయపరిశీలన జరిగింది. పార్లమెంటు అభ్యర్ధుల వ్యయపరిశీలన (రికన్సిలేషన్) కార్యక్రమం 3వ దఫా చేయడం జరుగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి జనార్థన్ నివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు నియోజకవర్గ వ్యయపరిశీలకులు దేవేంద్రకుమార్ నిమ్, ఆడిట్ అధికారులు వి.వై.ఎస్.పావని, వ్యయవిభాగం నోడల్ అధికారి డి.డి.ముల్లర్, వ్యయపరిశీలకులు బి.శ్రీహరిరావు, పార్లమెంటు, నియోజకవర్గానికి పోటీలో ఉన్న అభ్యర్ధులు, తదితరులు పాల్గొన్నారు.