రాష్ట్రీయం

నేడు చిన్నతరహా పరిశ్రమల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకునేందుకు మంగళవారం హైదరాబాద్‌లోని బాలనగర్ మినర్వా కాంప్లెక్స్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మైక్రో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ తెలిపింది. తెలంగాణ ఇండస్ట్రీయల్ ఫెడరేషన్ సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సోమవారం నాడిక్కడ ఫెడరేషన్ ప్రతినిధులు బాలాజీ సింగ్, లక్ష్మీకాంతయ్య, కె.సుధీర్‌రెడ్డి, గోపాల్‌రావు, రవీందర్‌రెడ్డి, వెంగయ్య, దామోదర్ తదితరులు విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలో 70 వేల సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయని, తద్వారా 5 నుంచి 10 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు. ప్రస్తుతం చిన్న తరహా పరిశ్రమలు చాలా కష్టాల్లో ఉన్నాయని తెలిపారు. వాటిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం తమ సమస్యల పట్ల చిన్న చూపు చూసిందని అన్నారు. రాయితీలు ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులు జరపలేదని తెలిపారు. తమ సదస్సు ద్వారా ఫెడరేషన్ ఎదుర్కొంటున్న సమ్యసలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు నిర్ణయించినట్లు వారు వివరించారు. ఈ సదస్సుకు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

కాల్షియం కార్బైడ్‌పై నిషేధం
హైదరాబాద్, డిసెంబర్ 28: పండ్లను పక్వానికి తెచ్చేందుకు ఇక నుంచి కాల్షియం కార్భైడ్ వినియోగించడాన్ని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు కూడా ఇటీవల ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి కాల్షియం కార్భైడ్‌ను నియంత్రించాలని ఆదేశించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలతో కూడిన నియమావళిని ప్రభుత్వం జారీ చేసింది. మానవాళికి అనారోగ్యాన్ని కలిగించే ఇలాంటి కాల్షియం కార్భైడ్‌ను వినియోగించరాదని తెలిపింది. దీనిని వినియోగించిన పండ్లను విక్రయించరాదని, కాల్షియం కార్భైడ్‌ను నిషేధించిన విషయాన్ని ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు భాషల్లో నోటీసు బోర్డులను అవసరమైన చోట్ల ఉంచాలని సూచించింది. అనారోగ్యానికి గురి చేసే పండ్లను తినొద్దని ప్రచారం చేయాలని తెలిపింది.

న్యూరోమస్క్యులర్ నొప్పి నివారణ పరికరం
హైదరాబాద్, డిసెంబర్ 28: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌కు చెందిన రిత్విక్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డ్రగ్స్ అవసరం లేని న్యూరోమస్క్యులర్ నొప్పి నివారణ పరికరాన్ని ఆవిష్కరించింది. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో సోమవారం ఈ పరికరాన్ని యశోదా హాస్పిటల్ స్పైనల్ సర్జన్ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, యుఎస్‌లోని మిస్సోరికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ కృష్ణకాంత్‌రెడ్డిలు ఆవిష్కరించారు. డాక్టర్ సంజయ్, కృష్ణకాంత్ మాట్లాడుతూ ఈ పరికరం అడ్వాన్స్‌డ్ యుఎస్‌ఏ పేటెంట్ మెడికల్ డివైస్‌గా గుర్తింపు పొందిందని అన్నారు. ఎఫ్‌డిఏ కూడా ఈ ఉత్పాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వారు వెల్లడించారు. ఈ పరికరం కీళ్ల నొప్పులు, నరాల నొప్పులు, కండరాల నొప్పుల కోసం వినియోగిస్తే ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని వారు వివరించారు.

ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సిల్ సభ్యుల నియామకం
హైదరాబాద్, డిసెంబర్ 28: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలికి సభ్యులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలిలో సభ్యులుగా ప్రొ.డాక్టర్ కె.శ్రీకాంత్‌రెడ్డి, నిమ్స్ మాజీ డైరక్టర్ ప్రొ.డాక్టర్ డి.రాజారెడ్డి, తెలంగాణ మాజీ డిఎంఇ ప్రొ.డాక్టర్ పి.శ్రీనివాస్, అనెస్థీషియా ప్రొ.డాక్టర్ మంథ శ్రీనివాస్, నిజామాబాద్ మెడికల్ కాలేజీ ఫార్మాకోలజీ ప్రొ.కె.ఇందిర, కాకతీయ మెడికల్ కాలేజీ ఆఫ్తాల్మాజీ ప్రొ.డాక్టర్ జె.పాండురంగారావు, కరీంనగర్ పిఐఎంఎస్ రేడియోలజీ ప్రొ.డాక్టర్ బి.రమేష్‌లను నియమిస్తూ ప్రభుత్వం జివో జారీ చేసింది. వీరంతా మూడేళ్లపాటు సభ్యులుగా కొనసాగుతారని వెల్లడించింది.

ఎన్‌ఓసీ జారీకి కమిటీ
హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణలో కొత్తగా మెడికల్, డెంటల్, నర్సింగ్ కాలేజీలు, ఎంపిహెచ్‌డబ్ల్యూ (ఎఫ్) శిక్షణ సంస్థలు, పారామెడికల్, ఆయుష్ కాలేజీలను స్ధాపించాలనుకునే వారికి నిరభ్యంతర (ఎన్‌ఓసి) లేదా తప్పనిసరి సర్ట్ఫికెట్ జారీ చేసేందుకు ఉన్నత స్ధాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తులను క్షుణ్ణంగా కమిటీ పరిశీలించిన అనంతరం కమిటీ నిర్ణయం మేరకు సంబంధిత అధికారులు సర్ట్ఫికెట్లను జారీ చేయాల్సి ఉంది. కమిటీకి చైర్మన్‌గా హైకోర్టు జడ్జి ఎ.గోపాలరెడ్డి, సభ్యులుగా కాళోజీనారాయణరావు ఆరోగ్యవిశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, నిమ్స్ డైరక్టర్, తెలంగాణ వైద్య విద్య డైరక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరీంనగర్ జిల్లాలో
డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన సంస్థ
హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణలో ఉన్నత ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన సంస్థ (ఐటిడిఆర్)ను ఏర్పాటు చేస్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థను రూ.16.40 కోట్ల వ్యయంతో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం మందేపల్లిలో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 24 నెలల్లో పూర్తి కావాలని కూడా తెలిపింది. ఈ శిక్షణ సంస్థ ఏర్పాటుకు తెలంగాణ రవాణాశాఖ, కేంద్ర ప్రభుత్వం, అశోకా లేలాండ్ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ప్రతి మూడు నెలలకోసారి ప్రాజెక్టు నిర్మాణ పనితీరు నివేదికను కేంద్రానికి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.

ప్రజలతో కెటిఆర్ ముఖాముఖి
హైదరాబాద్, డిసెంబర్ 28: ప్రజలతో ముఖాముఖి పేరుతో ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు కొత్త కార్యక్రమం చేపట్టారు. సామాన్య ప్రజల నుంచి విఐపిల వరకు ఎవరైనా ప్రశ్నించవచ్చు. మంగళవారం సాయంత్రం 6.45కు శిల్పారామంలో ఈ కార్యక్రమం ఉంటుంది. వివిధ అంశాలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు కెటిఆర్ సమాధానం ఇస్తారు.