రాష్ట్రీయం

మిషన్ భగీరథకు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూనిర్వాసితులను ఆదుకుంటాం * సిఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్

జనగామ , డిసెంబర్ 12: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తోన్న మిషన్ భగీరథ పథకానికి భూయజమానులు సహకరించాలని ముఖ్యమంత్రి ప్రత్యే క కార్యదర్శి స్మితా సబర్వాల్ కోరారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలో చేపడుతున్న పనులను శనివారం ఆమె పరిశీలించారు. స్థానిక కళ్లెం రోడ్డు మార్కండేయ దేవాలయ సమీపంలో మిషన్ భగీరథ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన భూమి వివరాలను తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో చేసిన మార్కింగ్‌ను పరిశీలించి సంబంధిత రైతులతో మాట్లాడారు. భూనిర్వాసితులకు సరై న నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పద్మశాలి అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కండేయ ఆలయ నిర్మాణం కోసం ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి కొనుగోలు చేసిన భూమిలో ఈ పథకం పనులు చేపడుతున్నందున తమకు సమీపంలోని భూమిని కొనుగోలు చేసి ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించి స్మితా సబర్వాల్ సమీప రైతులతో మాట్లాడి భూమి కొనుగోలు చేసి ఆలయానికి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నాగారం రోడ్డులో నిర్మించనున్న మరో మిషన్ భగీరథ వాటర్‌ట్యాంకు పనులను పరిశీలించారు. పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను కోరారు. అనంతరం స్థానిక ఆర్డీవో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కళ్లెం రోడ్డులో 1.50 బ్యాలెన్సింగ్ వాటర్‌ట్యాంకును, అలాగే నాగారం రోడ్డు లో ప్రెషర్ కంట్రోల్ ట్యాంకును నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఇ నందన్‌రావు, ఎస్‌ఇ యేసురత్నం పాల్గొన్నారు.