స్మృతి లయలు

జీవితం మారుట దానికి సహజమురా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవతల భెజవాడ సంచిక డైలీ ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు వేగవంతం చేయబడ్డట్లే వుంది. పై ఏడాది జనవరిలో యిది సాధ్యం కావచ్చును. (1965) అనుకుంటూ వుండగా- నేను సినిమాలకి- అంటే స్టూడియోల్లో చూపించే ప్రీవ్యూలకి సహచరులను పంపించేస్తూ వున్నాను. డైలీ ప్రెస్సులోకి ఓసారి వెళ్లాను. వర్కర్‌లు చుట్టుముట్టేస్తారు. ‘‘డైలీలోకి దిగిపోతున్నారా, సామీ?’’ అంటారు.
అక్కడ ప్రూఫ్‌రీడర్ల బల్ల మీద కొత్తగా - అన్నారుద్ర ప్రక్కన కనబడుతున్న శాల్తీ- బొంబాయి నుంచి వచ్చిన - ‘సికరాజు’ అంటే- కనకాంబరరాజు, అటు తర్వాత వీక్లీకి, ఆనక బెజవాడ వీక్లీకీ, తదుపరి తిరిగి హైదరాబాదు డైలీకి- అక్కణ్నుంచి ఆంధ్రభూమి కార్యాలయంలోనికి- (వాళ్లు కొత్తగా పెట్టిన భూమి వీక్లీకి) యిట్లా అంచెలంచెలుగా ఎదిగిపోయిన వాడు- నాటకాల రచయిత- అతను.
నాకు యిప్పుడు జ్ఞాపకం వస్తోంది. సికరాజు- (కనకాంబరరాజు పెన్ నేమ్) ఒక్కడే కాదు- ప్రూఫ్‌రీడర్‌గా చేస్తూ- ఎడిటర్‌గా ఎదిగిన వాళ్ల సంఖ్యయే ఎక్కువ. మా జి.ఎమ్.గారు- కుంచితపాదంగారు) కూడా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోప్రూఫ్‌రీడర్‌గానే రంగప్రవేశం చేశాడుట!
నెలాఖరులో ఒక్కోసారి వారపత్రికలో ప్రూఫ్‌రీడర్‌గా వున్న పెద్దాయన- జియాలజీ ఆనర్స్ చదివిన శ్రీరామ్మూర్తి (?) డైలీ సికరాజు, నా బల్లదగ్గరకు వచ్చేవారు. బ్రహ్మచారిని కదా, నెలాఖరున కూడా, నా దగ్గర ‘కాపర్స్’ (గిరీశం చెప్పినట్లు) వుంటాయని, ఓ ‘ఫైవ్’ లేదా ఒక్క రెండు (‘టూ’) రూపాయలు- చేబదులు అడిగేవారు. ‘రూపాయి’కి కూడా వేల్యూ వుండేది అప్పట్లో. తిరిగి అయిదో తారీఖున జీతాలు రాంగానే తెచ్చి నా బ్లెమీద పెట్టేసేవాళ్లు. నేను ఆ డబ్బులు, యిలా సొరుగు లాగి, ఓ ప్రక్కన పడేసుకునేవాణ్ని. ఎందుకూ, అంటే- నెక్స్ట్ మంత్- వాళ్లంతవాళ్లు వచ్చి అడిగితే, యివ్వగలగాలిగా...
బైది బై నేను బెజవాడ ప్రస్థానం అయినాకా- సికరాజు వారపత్రికకి బదిలీ (సబ్‌గా) అయినాడు. లోకం అతనిని- భూమి వీక్లీ-డైలీ- సంపాదకునిగానే ఎరుగుదురు గానీ- ‘‘మాకు మొదటినుంచీ తెలుసు. ’’సికరాజుకి ఎవిరమీదయినా కోపం వస్తే- వాళ్లమీద రేడియో నాటకం రాసేస్తాడుట. తెలుసా?’’ అని మా రాధాకృష్ణగారనేవాడు- బెజవాడ వచ్చాకా.
కనకాంబరరాజు మాత్రమేనా? ప్రూఫ్‌లు కరెక్టు చేస్తూ, పత్రికలను ఎడిట్ చేస్తూ- చత్రం తిప్పిన- ఐ.వి.ఆర్. అనగా- ఇనగంటి వెంకట్రావు- పూర్వాశ్రమంలో- నాకు అత్యంత ప్రియతముడుగా, బెజవాడ డైలీలో ప్రూఫ్‌రీడర్‌గానే జర్నలిజమ్ కెరీర్‌ని మొదలుపెట్టేడు. ఇది పాస్ట్‌టెన్స్. అలాగే నన్ను అనురాగంతో చూసిన ‘శార్వరి’- ప్రభ- అత్యంత ఉన్నత స్థానానికి వెళ్లిన ప్రతిభావంతుడే. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి రెసిడెంట్ ఎడిటర్ అయిన- పెద్ద్భిట్ల శివసుందరం ఆంధ్రపత్రిక ప్రాడెక్టే! ప్రభలో ప్రూఫ్ రీడర్. విజయబాబు మాత్రమే కాదు వాళ్ల అన్నయ్య విక్రమ్ (‘పల్లకీ’ ఎడిటర్) నా ప్రేమాభిమాని. విజయబాబు, వేదగిరి రాంబాబులు- రేపటి ‘సూర్యులు’ అన్నట్లు ఎదిగారు. విజయబాబుని ప్రభలో ప్రూఫ్ రీడర్‌గానే నేను ఎరుగుదును. కానీ మళ్లీ కలిసేసరికి దినపత్రిక ఎడిటర్‌గా చూశాను.
‘‘సాధనమున ప్రతిభ రాణించున్’’- అన్నట్లు వీళ్లంతా ‘‘ముందొచ్చిన చెవులుకన్న వెనకొచ్చిన కొమ్ములు వాడి’’- అన్నట్లుగా రాణించారు. మా, మతుకుమల్లి మాధవరావు కూడా రుూ ‘లిస్టు’లో వున్నాడు. నాకు వీళ్లంతా మధురస్మృతులు. ఇదంతా అప్రస్తుతం ఏమో గానీ- ‘‘జర్నలిజం ఒక అరవ (అరువు) చాకిరీ,’’ అనుకునే వాళ్లకి- నా విషయంలో కాకపోవచ్చును- అని చెబుతూంటాను నేను.
నేను నోటిసు బోర్డుమీద- లేబర్ ఆఫీసుకి పంపే వాటిమీదా కూడా ఎడిటర్ అన్న మాట దగ్గర హంసపాదు పెట్టి- పెట్టాల్సిన సంతకం- ‘వీరాజీ’- అనే చేసేవాణ్ని- అదీ తెలుగులో. ఇది మా వాళ్లెవరికో ‘ఐసోరు’ అయింది. జి.ఎమ్.గారి దాకా వెళ్లిందిట. ఆయన నవ్వేసి- ‘‘నా పాకరేం.. పో’’- అన్నాడుట. ‘‘మాకు కావాల్సింది ‘వీరాజీ’యే,’’ అని- నాతో నవ్వేస్తూ- ‘‘పోనీ, సైన్ యిట్ విత్ ఒరిజనల్ నేమ్’’, అన్నాడు.
‘‘సిగ్నేచర్‌లో పేరు కనబడుతుందా, సార్? నా సంతకం ఓ బొమ్మలా వుంటుంది. మీ సంతకం ఓ శిలా తోరణంలా వుంటుంది,’’ అన్నాను. ఆయన- ‘పిళ్లా కృష్ణమూర్తి అలియాస్ వీరాజీ’గా రికార్డులో మార్చేశాడు. ఆనక బెజవాడ వెళ్లాకా ఒకానొక సందర్భంలో మళ్లీ ‘వీరాజీ’ పేరు నలిగింది. జి.ఎమ్.గారు తక్షణం గెజిట్ పబ్లికేషన్ యిచ్చేశాడు. ‘‘పిళ్లా కృష్ణమూర్తి అలియాస్ వీరాజీగా వున్న పేరు యిక మీదట ‘పిళ్లా కృష్ణమూర్తి వీరాజీ’ (పి.కె.ఎమ్.వీరాజీ)గా అధికారిక రికార్డ్సులో చెలామణీ అవుతుంది’’- అని చెప్పారు. అటుతర్వాత ప్రావిడెంట్ ఫండ్ రికార్డులో తప్ప- ‘పిళ్లా కృష్ణమూర్తి’ అన్న మకుటం యింకెక్కడా రాలేదు. ‘వీరాజీ’గా ‘ఇంప్రింట్’లో కూడా సెటిల్ అయిపోయింది. కానీ రుూ ప్రాసెస్ పూర్తి అయి- మూడువేపులా వాడివున్న ‘త్రిశూలం’ లాంటి శిఖరం చేరుకోడానికి- దారిపొడుగునా- కన్నీళ్లూ, నెత్తురూ- కలిపి నైవేద్యం పెట్టాల్సి వచ్చింది. చివరకు ఎన్నడేనా సుఖపడ్డానా? అన్న మాటలే స్ఫురిస్తూ వుంటాయి. ఒక విరామం లేని పోరాటం!
అయ్యవారిని ఆఫీసులోనే చూశాను. ఆయన ‘యిలా’ తల ఎగరేసి చూస్తారు. జోడుగుళ్ల పిస్తోలు సంధించినట్లుంటాయి ఆయన చూపులు. కానీ, తను పొడిగా నవ్వేస్తారు. అప్పుడు ‘‘అమ్మయ్య,’’ అనుకుంటాం. ఎన్నో చెప్పాలనుకున్నాను. మాటలన్నీ లోపల్లోపల ఘార్ణిల్లే సంద్రమే అయినాయి, గానీ ఒక్క మాట పెదవి దాటి రాలేదు. ‘సారు’ ఓ కాగితం నా ముందుకి త్రోశారు. ముట్టుకుంటే ‘ప్రేలే పటాకీ’యా, అన్నట్లు తీసుకున్నాను.
అది ఎన్.టి. రామారావు అయ్యవారికి, స్వదస్తూరీలో- రాసిన లెటర్ సారాంశం- ‘‘వీరాజీగారిని బెజవాడ పంపటం సముచితం కాదు. యిక్కడ మద్రాసులోనే వుంటే బావుంటుంది. చలనచిత్ర పరిశ్రమతోగల సత్సంబంధాలు కూడా సమన్వయం అవుతాయి’’- అన్నది.
వెనె్నముక లోంచి ఒక ‘మెఱుపుతీగ’ జారింది. ‘‘అసలు నేను మళ్లీ ఎన్.టి.ఆర్.ని- కలవనేలేదు- సార్! మనం వేసిన వ్యాసాలన్నీ కూడా ‘బేరర్’ ద్వారానే, తెచ్చి వేసుకున్నాం’’, అన్నాను. నా ‘‘ముఖాముఖీ’’ తర్వాత ఎన్.టి.ఆర్.గారు ఒక సుదీర్ఘమైన వ్యాసాల పరంపర వీక్లీలో రాశాడు- తప్ప, ఆంధ్రపత్రిక ఫంక్షన్లు తప్ప మళ్లీ ముఖాముఖీ లేదు.
‘నాకు అర్థం అయిందిలెండి. మంచిదేగా?’’ అన్నాడాయన. ‘‘గుడ్‌విల్ మనకవసరమే. ఈ లెటర్ మీ ఫైల్లో వేసుకోండి’’, అని టాపిక్ మార్చేశారు. ‘‘దొడ్డమనిషి’’అయ్యవారు, కానీ ‘రొటీన్’ ఆయన చూడటం లేదు కనుక. మిగతా విషయాలు ప్రస్తావించగల ధైర్యం మాకు ఎవ్వరికీ లేదు.
‘‘ప్రకాశరావుగారు వస్తున్నాడు బెజవాడకి. అతనితో సహకరించి, అతనితో సర్దుకుపోయే విధంగా వున్న వాళ్లుంటే బాగుంటుంది’’- అనుకున్నారు. సరే! వి.వి.ఎన్.గారుంటాడు. ఎస్.వెంకటేశ్వర్రావుగారు- రుూ నాలుగుస్తంభాలనీ అక్కడికి తోలేస్తున్నాం’’, అన్నారు.
అయిపోయింది. తొలి ‘యింటర్‌వ్యూ’ చేసి, డైలీ హాల్లోకి, అదే క్షణంలో పంపించిన అయ్యవారు- బెజవాడ డైలీ హాలుకి నన్ను త్రోసేస్తున్నారన్నమాట. ‘‘మారిపోవురా... జీవితం... మారుట దానికి సహజమురా...’’ అనిపించింది.
అయితే, అటు తరువాత మ్యానేజిమెంట్ ఏమీ మాట్లాడలేదు. నవంబర్, డిసెంబర్ నెలలున్నాయిగా అన్నట్లు- నిమ్మకు నీరెత్తినట్లు- రొటీన్ కానిచ్చారు. బెజవాడ దుర్గ్భావన్, గాంధీనగర్‌లో ఐదు రోడ్ల కూడలి- అక్కడ దుర్గ్భావన్- అదే అటు తర్వాత ఆంధ్రపత్రిక కార్యాలయం- కావీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు- గాంధీ మహాత్ముని ‘బస’కోసం దాన్ని కేటాయించారు. తొలి ఆస్థానకవి- శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్ర్తీగారు దానికా నామకరణం చేశారు. అక్కడ రిక్రూట్‌మెంట్ సాగుతోంది.
ఇద్దరు, ముగ్గురి అప్లికేషన్లు నాకు పంపారు చూడమని. అందులో ఆంధ్రజ్యోతికి చెందిన పొట్లూరు వెంకట్రావుది, వేమూరి సుబ్రహ్మణ్యం అనే గవర్నమెంటు ఎల్.డి.సి.,లవి వున్నాయి. బై ది బై- రుూ వేమూరి సుబ్రహ్మణ్యం మా ఇంటర్ మీడియెట్ క్లాస్‌మేట్. నా సన్నిహిత దోస్తు షరీఫ్‌కి తెలుసు. తను నాకో పెద్ద లెటర్ రాశాడు హైదరాబాద్ నుంచి. ఇతను మా బెజవాడ మ్యానేజర్ వి.రమేష్‌బాబు అన్నట్లు- ‘‘చాలా ముదురుకేసు’’. ఆనక తెలుసుకున్నాను నేను కూడా ఆ సంగతి..
వెంకట్రావు విజయవాడలో అప్పయింట్ అయిన, తొలి ‘సబ్’, ‘జ్యోతి’కి ‘లాస్’- పత్రికకి ‘లాభం’- అంటూ నేను వ్యాఖ్యానించేవాణ్ని. ఇన్ని జరిగినా, నాకు ‘కాగితం’ లేదు. సదపాయాల వూసే లేదు. గొప్ప సస్పెన్స్... టెన్షన్.. సభాపతినీ అక్కడి నుంచి మ్యూజియమ్‌కి పోయి- నీలం హరినీ కలిసి తిన్నగా మైలాపూర్- శుకనివాస్‌కి దారితీశాను. ఈ ‘శుక నివాస్’ చిత్రమైన ఉత్తరాది రెస్టారెంట్. చిన్న జాగాలోనే హాలు లోపల డ్యూప్లెక్స్ టైప్‌గా ఓ అటక- దాని మీదికి మెట్లు కట్టించాడు, ఆ గడుసు యజమాని. ‘డబుల్ డెక్కర్ హోటల్’ అనే వాళ్లం మేము. అక్కడ పుల్కా, చెపాతీలు దొరికేవి. పుల్కాతో చిన్న ఉగ్గు గినె్నడు ఉల్లి చెక్కు, మిర్చీ కలిపిన పెసర పప్పు- ఉత్తరాది కూరలూ యిచ్చేవాడు. గొప్ప డిమాండ్- ఆ ‘పప్పు’కి ‘మారు’లేదు. (ఎక్స్‌స్ట్రా) అంతటా ఇడ్లీ, వడా, ఉతప్పం, కిచిడీల సామ్రాజ్యంలో రుూ హోటలు మముబొంట్లకు స్వర్గమే!
మిత్రులు సలహా యిచ్చారు. ‘‘అమ్మ దగ్గర యింట్లో వుండాల్సిన నువ్వు- ‘టెర్మ్స్’, ‘కండీషన్స్’ మానేసి, మారిపో మీ డాడీ వుంటే, ఒంటరిగా యెక్కడ వున్నా, ఓ.కే.గానీ- నీ కెరీర్‌కి ఇట్లా కూడా కృష్ణాతీరంలో యిప్పుడు నువ్వు అవసరం,’’ అన్నారు. టి.నగర్‌లో చిత్ర నరసింహారావు, విశ్వప్రసాద్ మొదలు ఇంటూరి దాకా అంతా- ‘‘మన రాష్ట్రంలోకి మనం వెళ్లిపోగల అవకాశం వదలకు’’ ‘‘యంగ్ బ్రదర్’’ (అలా అనేవాళ్లు నన్ను) అన్నారు. ‘‘మెరీనా బీచ్ మీద కథలు రాయడానికి - చూసిన సముద్రం చాలులే’’ అన్నాడు మా రామప్రసాద్.
వీక్లీ మీద శ్రద్ధా, ప్రేమా పెరిగాయి. ఇంకా గట్టిగా చేస్తున్నాను. ‘శెలవు’ వూసెత్తలేదు. ‘విశ్రాంతి’ మాట అనుకోనే లేదు. అడ్వర్‌టైజ్‌మెంట్ శాఖ నుంచి రామచంద్రయ్య ‘‘నేనూ వచ్చేస్తున్నాను, సార్!’’ అన్నాడు. అతను కాళహస్తి నుంచి సబ్ ఎడిటర్ పోస్టుకి వస్తే- ‘యాడ్స్’ డిపార్ట్‌మెంట్‌లో వేశారు. అకౌంట్స్ వచ్చున వాడని. సర్క్యులేషన్ నుంచి- అప్పాదురై ‘‘నేనూ వస్తున్నాను బెజవాడకి,’’ అన్నాడు.
అంతా బాగుంది గానీ రాధాకృష్ణగారు మా డిపార్ట్‌మెంట్‌లో గానీ- అమృతాంజన్ ఛాంబర్‌లో గానీ ఒంటరిగా దొరకలేదు. ‘‘తప్పించుకు తిరుగువాడు గడుసరి సుమతీ’’- అనుకున్నాను. జి.ఎమ్.గారు చెప్పాడు-
‘‘నీది డిపార్ట్‌మెంటల్ బదిలీ. దీనికి, ‘‘నో జాయినింగ్ టైమ్’’ కనుక- ప్రయాణం ఏర్పాట్లు నేనే చేసి, ‘‘్ఫస్ట్లాసు’ టిక్కెట్టు అవీ అరేంజ్ చేస్తాను. కానీ, జనవరి సెకెండ్ వీక్ దాకా- ఫర్ గెటిట్’’- అన్నాడు.
ఎమ్.ఎన్.రావుగారు ప్రకాశంతో కబురెట్టాడు- ‘ప్రేమకు పగ్గాలు’ నవలకి- కపిల కాశీపతిగారి చేత ముందు మాటలు రాయిద్దామని వుంది అని. కపిల కాశీపతిగారు ఫిలిమ్ సెన్సారు బోర్డు బాస్‌గా, లిటరరీ స్టాల్‌వర్ట్‌గా పేరున్న వాడు. రావుగారిని కలిశాను.
ఓ ‘అడ్వాన్స్ చెక్కు’, అగ్రిమెంట్ చేతిలో పెట్టి- బెజవాడలో కలుద్దాం. ఓ ప్రాజెక్టు వర్క్ అవుట్ చెయ్యాలి’’, అన్నాడాయన.
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 92900 99512 veeraji.columnist@gmail.com