రాష్ట్రీయం

జెఎన్‌యు ఘటన వెనుక విచ్ఛిన్నకర శక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎబివిపి నేత సౌరభ్‌శర్మ ఆరోపణ
హైదరాబాద్, మార్చి 10: దేశ రాజధాని ఢిల్లీలోని జెఎన్‌యులో జరిగిన ఘటన వెనుక కొంత మంది కమ్యూనిస్టు భావజాల ప్రొఫెసర్లు, విచ్ఛిన్నకర శక్తులు ఉన్నారని వీరి కారణంగానే మొత్తం జెఎన్‌యు అప్రతిష్టపాలైందని ఆ యూనివర్శిటీ విద్యార్థి సంఘం సంయుక్త కార్యదర్శి, ఎబివిపి నేత సౌరభ్ శర్మ పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ దేశవ్యతిరేక నినాదాలు చేస్తున్న విద్యార్ధులకు జెఎన్‌యు బోధన సిబ్బంది మద్దతు పలకడం సరికాదని, ఒక భావజాలానికి చెందిన విద్యార్థులను వెనుకేసుకురావడం మంచిది కాదని అన్నారు. ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, దేశ వినాశక చర్యలకు పూనుకున్నా, ఒమర్ ఖాలిద్ అయినా, కన్హయ అయినా కారాగారానికి వెళ్లాల్సిందేనని అన్నారు. దేశరక్షణలో అమరులైన జవాన్లు చనిపోయిన రోజున స్వీట్లు పంచడాన్ని తాము తప్పుపడుతున్నామని పేర్కొన్నారు. జాతీయ జెండాను తొక్కిన వ్యక్తి దేశద్రోహం కేసు నమోదుకాగానే, తానూ ఈ దేశం వాడినేనని ప్రగల్బాలు పలుకుతున్నారని చెప్పారు. జెఎన్‌యులో జరిగిన అన్ని ఘటనల వీడియోలపై సమగ్ర దర్యాప్తు జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.