ఆంధ్రప్రదేశ్‌

పట్టిసం నుంచి 5664 క్యూసెక్కుల నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఆగస్టు 24: పట్టిసం ఎత్తిపోతల పథకంలోని 16 మోటార్లను బుధవారం నుండి ఆన్‌చేసి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు గోదావరి నీటిని తరలిస్తున్నారు. రోజుకు 5,664 క్యూసెక్కుల నీటిని కృష్ణా జిల్లాకు తరలిస్తున్నారు. ఎత్తిపోతల ప్రారంభించినప్పటి నుంచి అధిక మోటార్లు ఆన్‌చేయడం ఇదే మొదటిసారి. గత సంవత్సరం పాక్షికంగా పూర్తయిన ఎత్తిపోతల పథకంలోని 5 మోటార్ల ద్వారా సుమారు 1800 క్యూసెక్కుల నీటిని నవంబరు 5వ తేదీ వరకు తరలించారు. ఆ తరువాత గోదావరి నీటిమట్టం తగ్గిపోవడంతో మోటార్లను నిలిపివేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై 6వ తేదీన రెండు మోటార్లు ఆన్‌చేసి, ఈ సీజన్‌లో గోదావరి నీటిని కృష్ణా జిల్లాకు తరలించే ప్రక్రియ ప్రారంభించిన విషయం విదితమే. ఆ రోజు నుండి మోటార్ల సంఖ్య పెంచుతూ 12 మోటార్లతో నీటిని తరలిస్తుండగా ఈ నెల 1వ తేదీన తమ్మిలేరు వద్ద అండర్ టన్నల్‌కు గండి పడటంతో మోటార్లను నిలిపివేశారు. గండిని పూడ్చిన అనంతరం ఈ నెల 9వ తేదీ నుండి తిరిగి రెండు మోటార్లు ఆన్‌చేసి గోదావరి నీటిని తరలిస్తూ మోటార్ల సంఖ్యను పెంచుతూ బుధవారం నాటికి 16 మోటార్లను ఆన్ చేశారు. ఎత్తిపోతల పథకంలో 24 మోటార్లు ఉండగా 16 మోటార్లతోనే నీటిని తరలిస్తామన్నారు.

డెలివరీ పాయింట్ వద్ద పోలవరం
కుడి కాలువలోకి వెళ్తున్న గోదావరి నీరు