రాష్ట్రీయం

30 వరకూ అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి. శనివారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభల సభ్యులనుద్ధేశించి ప్రసంగించారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, జి. శ్రీకాంత్ రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార రాజు, అసెంబ్లీ ఇన్‌ఛార్జీ కార్యదర్శి కె. సత్యనారాయణ రావు తదితరులు హాజరయ్యారు. 16 రోజులపాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున యనమల అజెండాను సభ్యులకు అందజేశారు. 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సభలో సాధారణ బడ్జెట్, ఆ వెంటనే వ్యవసాయ బడ్జెట్‌నూ ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. అయితే వైకాపా ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించే రోజులను 40కి పెంచాలని డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం ససేమిరా అంది.
ప్రశ్నోత్తరాల తర్వాతే వాయిదా తీర్మానాలు
ఈ సమావేశాల నుంచి ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ తర్వాతే వాయిదా తీర్మానాల అంశం చేపట్టాలన్న స్పీకర్ కోడెల, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రతిపాదనకు బిజెపి, వైకాపా సభ్యులు అంగీకరించారు. సభ ప్రారంభంకాగానే ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడం, వెంటనే విపక్షాల సభ్యులు పోడియం వద్దకు దూసుకుని వచ్చి పట్టుబట్టడం, స్పీకర్ సభను వాయిదా వేయడం, పాలక-ప్రతిపక్షాల మధ్య ఘాటైన విమర్శలు, పరస్పరం ఆరోపణలు చేసుకోవడం చాలా కాలంగా జరుగుతున్నది. కాబట్టి ఈ సంప్రదాయానికి తెర దించాలని, పైగా అత్యంత విలువైన ప్రశ్నోత్తరాల సమయం దెబ్బతింటున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఖరారైన అజెండా, తేదీలు
గవర్నర్ ప్రసంగానికి 8, 9 తేదీల్లో ధన్యవాదాలు తెలియజేయడం, ప్రభుత్వ సమాధానంతో ముగుస్తుంది. 10న ఆర్థిక మంత్రి సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 11, 12, 13 తేదీల్లో అసెంబ్లీకి సెలవు దినాలు. 14, 15, 16 తేదీల్లో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ జరుగుతుంది. 17న ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. 18 నుంచి పద్దులపై చర్చ ప్రారంభమవుతుంది. 20న ఆదివారం, 25న గుడ్ ఫ్రై-డే సందర్భంగా సెలవు. 27న ఆదివారం సెలవు. 28, 29 తేదీల్లో వివిధ పద్దులపై చర్చ జరుగుతుంది. 30న ఎపి ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.

స్పీకర్ కోడెల అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశం