రాష్ట్రీయం

17నుంచి ఆరు రోజులు ఆంధ్ర అసెంబ్లీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలు వద్దు.. అభివృద్ధే ముద్దు: కోడెల
ఉత్సవాల కోసమే గవర్నర్‌ను కలిశానని వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకూ ఆరు రోజుల పాటు నిర్వహించనున్నట్టు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. సోమవారం ఆయన శాసనసభ ప్రాంగణంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాజధాని అమరావతిలో శాసనసభ సమావేశాలను నిర్వహించేందుకు తాము ప్రయత్నించామని అయితే అనేక సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా శీతాకాల సమావేశాలను సైతం హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సరైన వౌలిక వసతుల లేమి కారణంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నామని చెప్పారు. కాగా ఈసారి అసెంబ్లీ సమావేశాలను ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రతి సభ్యుడు వినియోగించుకోవాలని సూచించారు. నర్సరావుపేట మున్సిపాల్టీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించేందుకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిసినట్టు స్పీకర్ తెలిపారు. 11వ తేదీ నుండి మూడు రోజుల పాటు జరిగే శతాబ్ది ఉత్సవాలు తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 12వ తేదీన కార్యక్రమాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొంటారని, 13న గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పాల్గొంటారని చెప్పారు. నర్సరావుపేట శతాబ్ది ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని గత కొద్ది కాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండేలా చర్యలు చేపట్టామని, అలాగే ఐదు శ్మశానవాటికలు ఏర్పాటు చేశామని వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు తగదని, రాజకీయ అవకాశాల కోసమో, ఓట్ల కోసమో కాకుండా అభివృద్ధి కోసమే తాము పనిచేస్తున్నామని, ప్రతి దానికీ రాజకీయం చేయడం సరికాదని అన్నారు. బయట ఉండి సభ పెట్టమని అడుగుతారు...తీరా సభ పెట్టాక వాకౌట్ పేరుతో సభ నుండి బయటకు వస్తారు ఇదేం పద్ధతి అంటూ ఒక ప్రశ్నకు బదులుగా స్పీకర్ వ్యాఖ్యానించారు. చెన్నై బాధితులను ఆదుకునేందుకు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు స్పీకర్ వెల్లడించా రు. అసెంబ్లీ ఉద్యోగుల సంఘం కూ డా చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు 50వేల రూపాయలు ఇస్తున్నట్టు వెల్లడించారు. అలాగే నర్సరావుపేట అభివృద్ధికి కూడా అసెంబ్లీ సిబ్బంది 50వేల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.