బిజినెస్

మార్కెట్లకు ‘దాడుల’ దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 29: నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసినట్లు సైన్యం చేసిన ప్రకటన గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. మొదట్లో లాభాల్లో ట్రేడ్ అయినప్పటికీ దాడులు జరిపినట్లు సైన్యం ప్రకటించిన తర్వాత దేశీయ సూచీలు ఒక్కసారిగా భారీగా పతనమైనాయి. మదుపరులు అమాంతంగా అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఒక దశలో సెనె్సక్స్ 500 పాయింట్లకు పైగా పతనమైంది. అయితే చివరికి 465 పాయింట్లు నష్టపోయి 27,827.53 పాయింట్ల వద్ద ముగిసింది. గత జూన్ 24 తర్వాత సెనె్సక్స్ ఒక్క రోజులో ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి. ఆగస్టు 26 తర్వాత సెనె్సక్స్ ఇంత బలహీనంగా ముగియడం కూడా ఇదే ప్రథమం. అలాగే 8,600 పాయింట్ల దిగువకు పడిపోయిన జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ దాదాపు 154 పాయింట్ల పతనంతో 8,591. 25 పాయింట్ల వద్ద ముగిసింది. దాడుల ప్రభావం రూపాయి మారకంపై కూడా పడింది. డాలరుతో రూపాయి 49 పైసలు కోల్పోయి రూ.66.95 వద్ద ట్రేడయింది. అయితే ఎనిమిదేళ్లలో తొలిసారిగా చమురు ఉత్పత్తిని తగ్గించడానికి ఒపెక్ దేశాలు అంగీకరించిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో సాగాయి.
సెప్టెంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌ల గడువు ముగియడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది. ఫలితంగా సెనె్సక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లలో 29 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐపిఓను విజయవంతంగా పూర్తి చేసుకుని ఈ రోజే తొలిసారిగా మార్కెట్లలోకి అడుగుపెట్టిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు దాదాపు11శాతం నష్టపోయింది. ఈ షేరు ఇష్యూ ధర రూ. 334 కాగా, బిఎస్‌ఇలో రూ. 229 వద్ద లిస్టింగ్ అయి చివరికి రూ. 297.65 వద్ద ముగిసింది. కాగా, శుక్రవారం దాదాపు 12 చిన్న, మధ్య తరహా కంపెనీలు తొలి పబ్లిక్ ఇష్యూ(ఐపిఓ)ల ద్వారా మార్కెట్లలో ప్రవేశించనున్నాయి. ఈ ఐపిఓల మొత్తం విలువ రూ 70 కోట్లు. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియగా, ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంలోనే లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.