రాష్ట్రీయం

అద్భుతమైన సచివాలయం నిర్మిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: విపక్షాలు ఎన్ని అడ్డంకులు కల్పించినా అద్భుమైన సచివాలయాన్ని నిర్మించి తీరుతామని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసి సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా వినతిపత్రం ఇవ్వడం శోచనీయం అని అన్నారు. ఇప్పుడున్న సచివాలయం ప్రజల అవసరాలకు అనుగుణంగా లేదని, ముఖ్యమంత్రి ఉండే సి బ్లాక్ చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగే చోటు కూడా లేదని, ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి కూడా వీలులేదని తెలిపారు. సచివాలయం గదుల్లో సరైన గాలి, వెలుతురు రావడం లేదని చెప్పారు. సరైన వసతులు లేవని భవనాలు పాతవని చెప్పారు. ఏ మంత్రి కూడా తమ శాఖ అధికారులతో సమీక్ష జరపడానికి వీలుగా చాంబర్లు లేవని అన్నారు. ఇప్పటి అవసరాలకు అనుగుణంగా పరిపాలనకు కావలసిన వసతులు ఉండే విధంగా సచివాలయానికి కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే కాంగ్రెస్ నాయకులు దానిని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు వేశారని విమర్శించారు. గవర్నర్‌ను కలిసి తప్పుడు ఫిర్యాదులు చేశారని మండిపడ్డారు. కళాభారతి నుంచి సచివాలయం వరకు ప్రతి దానికి వ్యతిరేకంగా కోర్టులకు పోవడం, గవర్నర్‌ను కలవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. 60 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, టిడిపి నాయకులకు నేటి అవసరాలకు అనుగుణంగా సచివాలయం కట్టాలన్న ఆలోచన రాలేదని అన్నారు. ముఖ్యమంత్రి నివాస భవనాల నిర్మాణంపై కూడా కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు పేలడం దారుణమని అన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న భవనాలు ముఖ్యమంత్రి కోసమే కానీ కెసిఆర్ కోసం కాదని అన్నారు. వచ్చే 150 ఏళ్ల వరకు ఉపయోగపడే విధంగా సిఎం నివాస నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై మొసలు కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం దాచుకోవడం మినహా ప్రజల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నిధులు దోచుకున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ అభినందించిందని గుర్తు చేశారు. బిజెపి కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, నీతి ఆయోగ్ సభ్యులు అభినందిస్తుంటే ఇక్కడ బిజెపి, కాంగ్రెస్, టిడిపి నాయకులు చిల్లర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.