బిజినెస్

పొట్టి ఫార్మాట్ సిరీస్‌కూ కోహ్లీ డౌటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, నవంబర్ 28: శ్రీలంకతో టెస్టు క్రికెట్ సిరీస్ ముగిసిన తర్వాత వనే్డ సిరీస్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోనున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ తర్వాత పర్యాటక జట్టుతో జరిగే ట్వంటీ-20 సిరీస్‌లోనైనా బరిలోకి దిగుతాడా? లేదా? అన్న దానిపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ విషయంపై ఇంకా ఎటూ తేల్చుకోని కోహ్లీ ఈ వారం చివర్లో జట్టు యాజమాన్యంతో పాటు సెలెక్షన్ కమిటీతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోనున్నాడు. శ్రీలంకతో ట్వంటీ-20 సిరీస్‌లో తలపడే భారత జట్టును ఇంకా ప్రకటించకపోవడంతో ఈ సిరీస్‌లో ఆడాలా? లేదా? అనే విషయంపై తాను నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని కోహ్లీ ఇంతకుముందే సెలెక్టర్లను కోరాడని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘డిసెంబర్ 12 వరకూ కోహ్లీకి కొన్ని వ్యక్తిగత పనులు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీలంకతో ట్వంటీ-20 సిరీస్‌లో ఆడాలా? లేదా? అనే విషయంపై కోహ్లీ నిర్ణయం తీసుకుంటాడు. కోహ్లీతో పాటు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్ర్తీతో కూడిన టీమిండియా యాజమాన్యం, జాతీయ సెలెక్షన్ కమిటీ ఈ వారం చివర్లో న్యూఢిల్లీలో సమావేశంమై దీనిపై నిర్ణయం తీసుకుంటారు’ అని ఆ అధికారి చెప్పాడు. భారత్‌లో శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ పర్యటన జరుపనున్న విషయం తెలిసిందే. తాము ఈ పర్యటనకు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం లేదని కోహ్లీ ఆందోళన వ్యక్తం చేయడంతో దక్షిణాఫ్రికాలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు ముందుగా కొంత మంది టెస్టు స్పెషలిస్టులను మాత్రమే అక్కడికి పంపే విషయమై సెలెక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.