ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా ధ్వజారోహణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 5: కడప జిల్లా ఒంటిమిట్టలో వెలసిన శ్రీకోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి సందర్భంగా ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. భక్తుల జయజయధ్వనాల మధ్య ధ్వజపటాన్ని ఎగురవేసిన అర్చకులు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. ఉదయం 8.40 గంటల ప్రాంతంలో శుభ ఘడియలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, విప్ మేడా మల్లికార్జునరెడ్డి, టిటిడి జెఇఓ పోలా భాస్కర్‌తో అర్చకులు మహా సంకల్పం చేయించారు. ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చిన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. అంతకుముందు ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం విష్వక్సేన పూజ, అష్టదిక్పాలకుల పూజలు నిర్వహించారు. సుందరంగా అలంకరించిన సీతారామచంద్రస్వాముల ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద భక్తుల దర్శనార్థం ఆశీనులను చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తులు తీసుకొచ్చిన ముత్యాల తలంబ్రాలను టిటిడి చైర్మన్ చదలవాడ, విప్ మేడా తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి శేష వాహనసేవ నిర్వహించారు. తొలుత అందంగా అలంకరించిన ఉత్సవమూర్తులను శేష వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయజయధ్వనాల మధ్య ఆలయ మాడా వీధుల్లో వాహన సేవ నిర్వహించారు. గురువారం స్వామివారు వేణుగాన అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి స్వామివారికి హంస వాహనసేవ నిర్వహిస్తారు.