శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్, డిసెంబర్ 12: వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసుల తక్షణ పరిష్కారానికి లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సిహెచ్‌కె దుర్గారావు కక్షిదారులకు పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవా భవనంలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్ సమావేశంలో జిల్లా జడ్జి ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ మండలస్థాయి నుండి నగరస్థాయి వరకు రోజూ జరుగుతుందని, ఇందులో భాగంగానే రాష్ట్ర లోక్ అదాలత్ ఆదేశానుసారం జాతీయ లోక్ అదాలత్ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. చట్టబద్ధమైన పరిష్కారానికి లోక్ అదాలత్‌ను ఉపయోగించుకోవాలని ఫ్రీలిటిగేషన్ కేసుల్లోని వ్యక్తులకు ఆయన సూచించారు. కోర్టుల్లో పెండింగ్ లేని కేసుల్లో ఇరువురి వ్యక్తుల నడుమ ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు వారు లోక్‌అదాలత్‌ను ఆశ్రయించి వారి సమస్యకు చట్టబద్ధమైన పరిష్కారం పొందవచ్చని ఆయన సూచించారు. ఈ ఏడాది లోక్‌అదాలత్ ద్వారా ఇప్పటివరకు 7,052 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. మోటార్ ప్రమాద కేసుల్లో పరిహారంగా రూ. ఐదు కోట్ల ఐదు లక్షల 84 వేలు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్‌పి గజరావు భూపాల్ మాట్లాడుతూ చిన్నపాటి కేసులు లోక్‌అదాలత్ ద్వారా త్వరగా పరిష్కారమైన పక్షంలో పెద్ద కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి దృష్టిపెట్టడానికి దర్యాప్తు అధికారికి అవకాశం ఉంటుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే లభించే ప్రయోజనాలకు విస్తృత ప్రచారం అవసరమని జిల్లా ఎస్‌పి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శ్యామలాదేవి మాట్లాడారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి సి సత్యవాణి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కాగా సమావేశంలో మోటార్ యాక్సిడెంట్ల ద్వారా లబ్ధిపొందిన కొందరికి జిల్లా జడ్జి సిహెచ్‌కె దుర్గారావు, ఎస్‌పి గజరావు భూపాల్ చేతులమీదుగా చెక్కులను పంపిణీ చేశారు. జాతీయ లోక్‌అదాలత్ సమావేశాలకు అనూహ్య స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల కేసులు 4,122 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో నెల్లూరు నగరానికి చెందిన 3,255 కేసులు ఉన్నాయి. మోటార్ యాక్సిడెంట్ కేసులు 166 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ కేసులకు సంబంధించి పరిహారం రూ. 38 లక్షల 27 వేల మేర క్లయిమ్‌లు పరిష్కరించారు. ఈ సమావేశానికి పట్టణంలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇన్స్యూరెన్స్ అధికారులు, బ్యాంక్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.

కృష్ణపట్నం పోర్టు సేవలు ప్రశంసనీయం:ఎస్‌పి
ముత్తుకూరు, డిసెంబర్ 12: సామాజిక సేవలో కృష్ణపట్నం పోర్టు సేవలు అద్భుతమని జిల్లా ఎస్‌పి గజరావుభూపాల్ ప్రశంసించారు. . శనివారం కృష్ణపట్నం పోర్టు శిక్షణా కేంద్రం ప్రాంగణంలో జరిగిన 23వ బ్యాచ్ పాసింగ్ పరేడ్ కార్యక్రమానికి ఎస్‌పి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సెక్యురిటీ నుండి ఆయన గౌరవవందనం స్వీకరించారు. 101 మంది సెక్యురిటీ శిక్షణ పూర్తిచేసుకొని ప్రశంసాపత్రాలను పొందారు. అనంతరం ఎస్‌పి మాట్లాడుతూ ఓడరేవు సెక్యురిటీ శిక్షణా కేంద్రం చాలా బాగుంటుందన్నారు. ముఖ్యంగా జిల్లాలో దైవ కార్యక్రమాలు జరిగినప్పుడు పోర్టు సెక్యురిటీ విధులు నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఇటీవల వరదల కారణంగా వరద బాధితులకు చేసిన సేవలు గుర్తుండిపోతాయన్నారు. వరద బాధితులను ఆదుకున్న ఘనత పోర్టుకు దక్కుతుందని ఎస్‌పి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓడరేవు సిఇఓ అనిల్‌కుమార్, శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్, పోలీసు అధికారులు, పోర్టు అధికారులు పాల్గొన్నారు.