శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఉపాధి భాగస్వామ్యంతో పక్కా గృహాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, అక్టోబర్ 1 : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పక్కా గృహాల నిర్మాణం, ఉపాధిహామీ భాగస్వామ్యంతో పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు వెల్లడించారు. జిల్లాలో నూతనంగా మంజూరైన పక్కా గృహాలకు సంబంధించి శనివారం పాత జడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డ్వామా, హౌసింగ్, డిఆర్‌డిఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ డ్వామా, డిఆర్‌డిఏల భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణం జరపాల్సి ఉంటుందన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం కింద 7550, ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకాల కింద మరో 3225 పక్కా గృహాలు మంజూరైనట్లు తెలిపారు. ఇందులో ఎన్టీఆర్ రూరల్ పథకానికి సంబంధించిన ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షలు వెచ్చిస్తుండగా అందులో ఉపాధి హామీ పథకం నిధులు రూ 50వేలు అన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకానికి సంబంధించి ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షలు వెచ్చిస్తుండగా అందులో ఉపాధిహామి పథకం నిధులు రూ.58,260 అని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులను అదనంగా మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12వేలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఉపాధిహామీ పథకానికి సంబంధించి ఆయా ఇండ్ల నిర్మాణానికి 90 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు, ఆయన ఇంటి కుటుంబ సభ్యులు సైతం ఈ పనుల్లో పాల్గొనవచ్చన్నారు. పనుల్లో పాల్గొన్న కూలీలకు రోజుకు రూ.194 చొప్పున 90 రోజులు పనిదినాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమయ్యే ఇటుకల తయారీ, డిఆర్‌డిఏకు చెందిన మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా మంజూరైన ఇళ్ల నిర్మాణంపై ఆయా ప్రాంతాల హౌసింగ్, డ్వామా, డిఆర్‌డిఏ అధికారులతో చర్చించారు. ఈసమావేశంలో హౌసింగ్ పిడి రామచంద్రారెడ్డి, డ్వామా పిడి హరిత, హౌసింగ్ డిఇలు, ఏఇలు, డ్వామా, డిఆర్‌డిఏల ఎపిఎంలు పాల్గొన్నారు.

మత్స్యకారులు సంక్షేమ పథకాలు
సద్వినియోగం చేసుకోవాలి:పాశం
వాకాడు, అక్టోబర్ 1: మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిపథంలో పయనించాలని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జిల్లా మత్స్యశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మత్స్యకార సంక్షేమానికి ప్రభుత్వం అనేక రాయితీలను ప్రకటించిందని, పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో మత్స్యకారులు వెనకబడి ఉన్నారని అన్నారు. టిడిపి ప్రభుత్వం మత్స్యకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. సబ్సిడీపై డీజిల్, ఇన్సూరెన్స్ తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 50 శాతం రాయితీతో 18 లక్షలతో విలువ చేసే వలలను మత్స్యకారులకు పంపిణీ చేశారు. ప్రతి మత్స్యకారుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. వారికి అవసరమైన డ్రై ప్లాట్‌ఫారాలు, కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామన్నారు. వారి పిల్లలను సమీప పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ప్రతి మత్స్యకారుడు తమ పడవను ఇన్సూరెన్స్ చేయించుకుంటే దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరిగితే లబ్ధి పొందవచ్చునని అన్నారు. ఎడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సముద్రంలోకి చేపలవేటకు వెళ్లేవారు తప్పనిసరిగా గుర్తింపుకార్డు ఉండాలన్నారు. అర్హత కలిగినవారు తమ శాఖ ద్వారా గుర్తింపు కార్డు పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిఓ కృష్ణకృషోర్, తహశీల్దార్ లావణ్య, ఎండివో ప్రమీల, జెడ్పీటిసి ఫ్రమీలారాణి, ఎంపిటిసి భాస్కర్, సర్పంచ్ కళ్యాణ్, కృష్ణమూర్తి, సంపత్‌కుమార్, రాజగోపాలరెడ్డి, శాలివాహన డైరెక్టర్ కోట శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కోట, అక్టోబర్ 1: మోటార్‌సైకిల్‌ను టాటా మ్యాజిక్ వాహనం ఢీకొనడంతో మునెయ్య (48) అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మండలంలోని మద్దాలి గ్రామానికి చెందిన మునెయ్య, శీనయ్య బేల్దారి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా శనివారం చిల్లకూరు మండలం గుత్తవారిపాళెం గ్రామానికి బేల్దారి పనులకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా కోట నుంచి గూడూరుకు వెళ్తున్న టాటా మ్యాజిక్ ఢీకొట్టింది. దీంతో మునెయ్య అక్కడికక్కడే మృతిచెందగా శీనయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న గూడూరు శాసనసభ్యుడు పాశం సునీల్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబీకులను పరామర్శించారు. మృతుడు పేదవాడు కావడంతో అతని కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన శీనయ్యను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించడంతో అక్కడి వైద్యులను శీనయ్యకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని వాకాడు సిఐ అక్కేశ్వరరావు, ఎస్సై అజయ్‌కుమార్‌లో పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాష్టస్థ్రాయి ఖోఖో పోటీలు ప్రారంభం
* తొలిరోజు హోరాహోరీగా సాగిన పోటీలు
* పోటీలను ప్రారంభించిన బీద మస్తాన్‌రావు, మేయర్
వేదాయపాళెం, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్ 50వ రాష్టస్థ్రాయి సీనియర్ ఖోఖో ఛాంపియన్‌షిప్ పోటీలు నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాజధాని అభివృద్ధి కమిటీ సభ్యుడు బీద మస్తాన్‌రావు, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి క్రీడామైదానాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. త్వరలో జరుగబోవు జాతీయస్థాయి క్రీడా పోటీలను అమరావతిలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్టస్థ్రాయి పోటీలు నెల్లూరు నగరంలో జరగడం ఆనందంగా ఉందన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు నెల్లూరును తమ సొంత జిల్లాగా భావించవచ్చన్నారు. జిల్లా క్రీడాకారులు, ప్రజల ప్రోత్సాహం ఇతర జిల్లాల క్రీడాకారులకు ఉంటుందన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి లోటుపాటులు జరగకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ పోటీలలో గెలుపొందిన మూడు స్థానాల జట్లకు బిఎంఆర్ ట్రస్టు ద్వారా మొదటి స్థానానికి రూ.25వేలు, రెండవ స్థానానికి రూ.15వేలు, మూడవ స్థానం వారికి రూ.10వేలు చొప్పున నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందన్నారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములను ఒకేలా తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొంది జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అక్కడ కూడా తమ సత్తా చూపి రాష్ట్రానికి పేరు తేవాలన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పివి రమణయ్య మాట్లాడుతూ పోటీల్లో నైపుణ్యం ప్రదర్శించిన వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టిఎస్‌ఆర్‌కె. ప్రసాద్, జనరల్ సెక్రటరి ఎం.సీతారామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అజిత్‌బాబుతోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు
నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో శనివారం తొలిరోజు జరిగిన రాష్టస్థ్రాయి ఖోఖో మహిళల విభాగంలో విశాఖ, నెల్లూరు జిల్లా జట్లకు పోటీ జరిగింది. అయితే ఈ రెండు జిల్లాల క్రీడాకారిణులు హోరాహోరీగా తలపడ్డారు. చివరకు నెల్లూరు జట్టుపై విశాఖ జట్టు 8- 6 సోర్కు తేడాతో విజయం సాధించింది. శ్రీకాకుళం, ప్రకాశం జట్ల మధ్య జరిగిన పోటీలో ప్రకాశం జిల్లా జట్టు 6-5 స్కోరుతో గెలుపొందారు. పురుషుల విభాగంలో మొదటి మ్యాచ్ ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కృష్ణా జిల్లాపై ప్రకాశం జిల్లా 12-11 సోర్కుతో గెలుపొందింది. రెండవ మ్యాచ్‌లో చిత్తూరు, గుంటూరు జిల్లాలు తలపడ్డాయి. ఉత్కంఠంగా సాగిన ఈ పోటీలో చిత్తూరుపై గుంటూరు జిల్లా 10-9 సోర్కుతో విజయం సాధించింది.

ప్రారంభమైన రాష్టస్థ్రాయి ఫెన్సింగ్ పోటీలు
* ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు
* తొలిరోజు పోటీలు జరగని వైనం
వేదాయపాళెం, అక్టోబర్ 1 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 62వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల అండర్-19 ఫెన్సింగ్ పోటీలు శనివారం నగరంలోని భక్తవత్సలనగర్‌లో గల కెఎన్‌ఆర్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఆర్‌జెడి వై.పరంధామయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు క్రీడలు ఒక వరమన్నారు. క్రీడలతో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఎందో క్రీడాకారులు క్రీడల ద్వారా ఉన్నత పదవుల్లో ఉన్నారన్నారు. ఇందుకు నిదర్శనం సచిన్ టెండూల్కర్, సానియామీర్జా, సింధూలేనన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యతోపాటు క్రీడలపై తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. ఆర్‌ఐఓ బాబుజాకబ్ మాట్లాడుతూ ఫెన్సింగ్ క్రీడను ఆదరించేవారు తక్కువగా ఉన్నప్పటికి రాష్టస్థ్రాయి పోటీలకు అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరుకావడం అభినందనీయమన్నారు. ఇప్పి, పాయిల్, సాబర్ విభాగాలలో జట్లు, వ్యక్తిగత పోటీలు నిర్వహించనున్నామన్నారు.
తొలిరోజు జరగని పోటీలు
నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా తొలిరోజు జరగాల్సిన రాష్టస్థ్రాయి 62వ ఫెన్సింగ్ పోటీలు జరగలేదు. శనివారం ఉదయం అధికారులు, నిర్వాహకులు రాష్ట్ర పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. అయితే పాఠశాలలో ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో పోటీలను మాత్రం నిర్వహించలేదు. పోటీలకు సంబంధించి పూర్తి వసతులు ఏర్పాటు చేసి ఆదివారం నుంచి ఈ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్ర స్థాయిలో ఫెన్సింగ్ పోటీలు నెల్లూరు నగరంలో జరుగుతుండడంతో నగర ప్రజలు భారీగా తరలివచ్చారు. టీవీల్లో చూసే ఈ క్రీడను నేరుగా తిలకించవచ్చని ప్రజలు బారులుతీరారు. అయితే నిర్వాహకుల నిర్లక్షం కారణంగా పోటీలు జరగకపోవడం ప్రజలు నిరుత్సాహంగా వెనుతిరిగి వెళ్లారు.