శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వివాహిత దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, డిసెంబర్ 19: భర్తతో విభేదించి నాలుగేళ్ల నుండి దూరంగా అద్దె ఇంట్లో నివాసం ఉంటూ వివాహేతర సంబంధం కలిగి ఉన్న ఓ మహిళ శనివారం గూడూరులో హత్యకు గురైంది. ఈ సంఘటన పట్టణంలో తీవ్ర సంచనలం కలిగించింది. 15 ఏళ్ల క్రితం వివాహమైన ఆస్మా (34) అనే మహిళ గూడూరుకు చెందిన బాషా అనే యువకుడిని వివాహం చేసుకొంది. బాషా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈక్రమంలో వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు కలిగారు. భర్త సంపాదన సరిపోలేదన్న సాకుతో భర్తను వదిలేసి తన పిల్లలతో గూడూరు ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గమళ్లపాళెంలో అస్మా అద్దె ఇల్లు తీసుకొని తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటోంది. ఈక్రమంలో దర్గా వీధికి చెందిన మాబూ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కలిగి వస్త్ర వ్యాపారం చేస్తుండేంది. తన వస్త్ర వ్యాపారం కోసం ప్రియుడి నుండి కొత్త మొత్తం అప్పుగా తీసుకొని వ్యాపారం నిర్వహించే క్రమంలో తన అప్పు తీర్చమని మాబూ ఒత్తిడి చేయడంతో అతనితో విభేదించి మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకొందని స్థానికులు అంటున్నారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత మాబూ మద్యం సేవించి వచ్చి ఇద్దరు గొడవ పడినట్టు డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అక్కడ నుండి వెళ్లిపోయిన మాబూ తిరిగి శనివారం వేకువఝామున 3 గంటల ప్రాంతంలో తిరిగి ఆస్మా ఇంటికి వచ్చి తనను నమ్మించి తన వద్ద ఉన్న నగదును తీసుకొని తనను కాదని మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకొన్న భావనతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు భావిస్తున్నట్టు డిఎస్పీ తెలిపారు. ఈక్రమంలో తన వద్దనున్న రాడ్‌తో ఆస్మాను కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోవడంతో అతను అక్కడ నుండి వెళ్లిపోయాడు. వేరొక గదిలో నిద్రిస్తున్న ఆస్మా పిల్లలు తల్లి దగ్గరకు వచ్చి చూసేసరికి అపాస్మారక స్థితిలో పడి ఉన్న తల్లిని చూసి చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలపడంతో వారు 1వ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గూడూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి బి శ్రీనివాస్, ఎస్సై దశరధరామయ్య సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులను విచారించారు. ప్రియుడే తన భార్యను హత్య చేశాడని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు నుండి డాగ్ స్క్వాడ్‌ను, వేలిముద్రల నిపుణులను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజలు నివ్వెరపోయారు.

‘రాజకీయ కక్ష సాధింపులో భాగమే అక్రమ కేసులు’
నెల్లూరుసిటీ, డిసెంబర్ 19: కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధించేందుకే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయాలని చూస్తున్నారని సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉడతా వెంకట్రావు ధ్వజమెత్తారు. శనివారం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మీద కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ ఇందిరాభవన్ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమిళనాడు నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో బోగస్ కేసువేసి తమ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఘోరం అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి చెంచలబాబు యాదవ్ మాట్లాడుతూ మాజీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రు కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక అవసరమనని స్వాతంత్య్రానికి పూర్వం 1937 సంవత్సరంలో నేషనల్ హెరాల్డ్‌ను స్థాపించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పత్రికను నడుపుతూ దాంట్లో నష్టం వచ్చినప్పటికి సోనియాగాంధీ పార్టీ కోసం పత్రికను నడుపుతున్నట్లు చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిహార్, ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయాన్ని చూసి వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటువంటి దుర్మర్గామైన ఆలోచనలు ప్రధామంత్రి మానుకోకపోతే దేశ ప్రజలు బిజెపిని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సివి శేషారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి కనకట్ల రఘురామ్ ముదిరాజ్, భావాని నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలసుధాకర్, శివకుమార్, ఆసీఫ్, షఫీ, శివాచారి, మూలం భాస్కర్, సుజాత , ఏడుకొండలు యాదవ్, పుష్పరాజ్, హరనాధ్ తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ నేత కేతంరెడ్డి అరెస్టు, విడుదల
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై అక్రమ కేసులను బనాయించడాన్ని నిరసిస్తూ శనివారం గాంధీబొమ్మ సెంటర్‌లో రాష్ట్ర యూత్‌కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం జరిగింది. ఒక దశలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో కేతంరెడ్డి వినోద్‌రెడ్డి అరెస్టు చేశారు. వెంటనే పూచీకత్తు మీద విడుదల చేశారు. ఈసందర్భంగా వినోద్‌రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 19న మూడు దశాబ్దల క్రితం ప్రతిపక్ష నేతగా ఉన్న ఇందిరాగాంధీని జనతాపార్టీ అరెస్టు చేయించిందన్నారు. కొన్ని నెలల వ్యవధిలోనే అప్పటి ప్రభుత్వం కుప్పకూలి ఇందిరాగాంధీ ప్రజాదరణతో మళ్లీ ప్రధానమంత్రిగా ఘన విజయం సాధించారన్నారు. అదే చరిత్ర ఇప్పుడు పునరావృతం కాబోతుందని అన్నారు.