ఆంధ్రప్రదేశ్‌

వెండి రథంపై విహరించిన దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) మార్చి 29: తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా బుధవారం కనక దుర్గమ్మ వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. తెలుగువారి తొలి పండుగ ఉగాది రోజున సాంప్రదాయంగా వస్తున్న పుష్పార్చన కార్యక్రమం కూడా కలిసి రావడంతో శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో వెండి రథోత్సవ ఊరేగింపుమహోత్సవం ఘనంగా జరిగింది. దేవస్థానం ఇవో ఎ సూర్యకుమారి ఆధ్వర్యంలో గంగాసమేత శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల ఉత్సవ మూర్తులను వెండి రథంలో ఉంచి ఈ ఊరేగింపుఉత్సవాన్ని నిర్వహించారు.
ఈ వెండి రథోత్సవం పాతబస్తీలోని పురవీధుల్లో అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు ప్రతి సెంటర్‌లో అమ్మవార్లకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారి సన్నిధిలో బుధవారం వసంత నవరాత్రి సందర్భంగా ఉదయం అమ్మవార్లకు అర్చకులు పుష్పార్చన నిర్వహించారు. బుధవారం కనకాంబరాలతో అర్చకులు ఈ ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తి ముందు ప్రత్యేక ఉభయదాతలను కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం భక్తులకు విశేషంగా ఆకర్షించింది. బుధవారం వేకువ జామున 3 గంటలకు అమ్మవార్లకు స్నపనాభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అర్చనలు తదితర కార్యక్రమాలను అలయ ఆస్ధానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు నిర్వహించారు. ఉదయం సుమారు 8-30 గంటలనుండి భక్తులను అమ్మవారిని దర్శించుకోవటానికి అంతరాలయంలోనికి అనుమతించారు. ఉదయం అమ్మవారిని దర్శించుకోవటానికి రూ. 300 టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు సుమారు 3గంటల సమయం పట్టింది. ఉదయం నుండే అధిక సంఖ్యలో మంత్రులు,ప్రిన్సిపల్ సెక్రటరీలు, శాసన సభ్యులు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

కనకదుర్గమ్మ వెండి రథోత్సవ దృశ్యం