క్రైమ్/లీగల్

కావలి వాయునందన ప్రెస్ వీధిలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి టౌన్, అక్టోబర్ 24: పట్టణంలోని వాయునందన ప్రెస్‌వీధి వినాయకగుడి ఎదురుగా ఉన్న అందే భాస్కర్‌రావు ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 12సవర్ల బంగారం, 2.70లక్షల నగదు అపహరించారు ఒకటవ పట్టణ ఎస్సై అంకమ్మ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి అందే భాస్కర్‌రావు కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో బాత్‌రూమ్ నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన గుర్తుతెలియని దుండగులు 12సవర్ల బంగారం, 2.70లక్షల నగదు ఎత్తుకుపోయారని తెలిపారు. నెల్లూరు నుంచి వచ్చిన క్లూస్‌టీం చోరీకి సంబంధించిన ఆనవాళ్లు సేకరించారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.