శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. విలువలీనాడు వేషభూషలకుఁ గాని
చదువరులకుండవే చూడజగతిలోన
చదువరులు చవటల చెంత నొదిగియుండు
కాలమే తెంచెఁ జోద్యంబు ఁ గాక యేమి?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఈనాడు వేషాలకు, ఆభరణాలకే తప్ప చదువుకున్న వాళ్లకు విలువలుండడం లేదు. చదువుకున్నవాళ్లు చదువుకోని చవటల చెంత ఒదిగియుండే కాలం వచ్చిందికదా! కలి ధర్మం వల్ల అధర్మం, అజ్ఞానాలే రాజ్యాలేలుతాయ. కనుక ఇట్లాంటి సంకటాలు ఏర్పడుతున్నట్టు ఉన్నాయ. ఓ కర్మసాక్షివైన సూర్యదేవ! చూడవయ్య.
తే.గీ. తిన్న దరగకఁ గొందరు తిరుగుచుండ్రు
తిండి దొరకక ఁ గొందరు తిరుగుచుండ్రు
ఇరువురకు మధ్య సంబంధమేమి లేదె
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!
భావం: ఈ రోజులో తిన్నది అరగక కొందరు తిరుగుతుంటే అసలు తిండే దొరకక అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ క్షుద్బాధతో తిరిగేవారు కొందరు ఉన్నవాడికి, లేనివాడికి మధ్య సంబంధమే లేకుండా పోయింది. ఉన్నవాడి దయాదృష్టి లేనివానిపై పడడం లేదే?ఐకమత్యభావంతో ఉండాలన్న భావం నశించడం వల్ల లేనివాళ్లకు ఉన్నవాళ్ల కరుణ దొరకడం లేదు దానివల్లనే ఇట్లాంటి పరిస్థితులువస్తున్నట్టున్నాయ. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262