ఆంధ్రప్రదేశ్‌

అశ్వవాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, మార్చి 10: శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు అశ్వవాహనంపై ఆదిదంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. గత నెల 29న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 11 రోజల పాటు నిర్విఘ్నంగా సాగాయి. చివరి రోజైన గురువారం భ్రమరాంబ మల్లికార్జున సామివార్లకు ఆలయ పండితులు, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి అశ్వవాహనంపై ఆశీనులను చేసి ఆలయ ఉత్సవం నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేక పూలతో అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమ శాస్త్రానుసారంగా మహామంగళహారతులు ఇచ్చి గర్భాలయ ప్రదక్షిణ గావించారు. ఈ ఆలయ ఉత్సవంలో డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ, విద్యుదీపకాంతులతో స్వామి అమ్మవార్లు ఎంతో వైభవంగా అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అశ్వవాహనంపై స్వామి అమ్మవార్లను చూసి భక్తులు శివనామస్మరణలతో తరించిపోయారు. అనంతరం అక్కమహాదేవి అలంకరణ మండపంలో స్వామివార్ల పుష్పోత్సవ పూజలు శాస్త్రానుసారంగా నిర్వహించారు. అనంతరం అద్దాలమండపంలో శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహించారు.

నుంకప్పకొండలో ‘ఝుంఢీ’ మేళా
రాయదుర్గం, మార్చి 10 : అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలో కర్నాటక సరిహద్దులోని నుంకప్పకొండలో గురువారం ఝుంఢీ మేళా ప్రారంభమైంది. మన రాష్ట్రంతో పాటు, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు 500 మంది నాథ్‌సంత్‌లు (యోగులు) ఈ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండప్రాంతంలోని భైరవనాథ్ ఆలయ ప్రాంగణంలో శ్రీ గోరఖ్‌నాథ్, జ్వాలానాథ్ విగ్రహాలను ప్రతిష్ఠించి హోమాలు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత్ వర్షీయ భేర్‌భారః పంత్ అవదూత్ సంప్రదాయ్ నవనాథ్ ఝుంఢీ అధిపతి మహంత్ యోగి సూరజ్‌నాథ్ మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మేళా నిర్వహిస్తారన్నారు. ఇందులో భాగంగా నాసిక్‌లో జరిగిన కుంభమేళాలో పాల్గొన్న నాథ్ సంప్రదాయానికి చెందిన యోగులు, సన్యాసులు దాదాపు 2500 కి.మీ పాదయాత్ర చేస్తూ కర్నాటకలోని మంగళూరుకు దగ్గరలోని కదిరి మఠానికి చేరుకుని అక్కడ శ్రీ గోరఖ్‌నాథ్‌కు పూజలు చేయడంతోపాటు మఠానికి కొత్త పీఠాధిపతిని ఎన్నుకుని, హోమాలు నిర్వహించి తిరిగి ఈకొండకు చేరుకున్నట్టు వివరించారు. ఈ ఏడు కొత్త పీఠాధిపతిగా నిర్మల్‌నాథ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వందలాదిమంది యోగులు, సన్యాసులు ఈకార్యక్రమంలో పాల్గొంటారన్నారు.