రాష్ట్రీయం

సభలోకి ససేమిరా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా అనుకున్నట్టే జరిగింది. వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ను హైకోర్టు నిలిపివేసినా..ఆమెకు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశించే అవకాశం దక్కలేదు. ఉదయం మొదలుకుని సాయంత్రం పొద్దుపోయే వరకూ రోజా వ్యవహారం రాజకీయ ఉత్కంఠను రేకెత్తించింది. కోర్టు ఉత్తర్వుతో సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రోజాను చీఫ్ మార్షల్ గణేశ్ అడ్డుకున్నారు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న తరుణంలోనే అక్కడికి వచ్చిన పార్టీ అధ్యక్షుడు జగన్ ‘రోజాను ఎందుకు అడ్డుకుంటున్నారు..హైకోర్టు తీర్పును కూడా ఖాతరు చేయరా..’అంటూ నిలదీశారు. దానికి చీఫ్ మార్షల్ నుంచి వచ్చిన ఏకైక సమాధానం ‘నాకు ఆదేశాలున్నాయి’ అన్నదే.. వాటిని ఎవరు జారీ చేశారో కూడా ఆయన చెప్పక పోవడంతో జగన్ సహా వైసిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపలి గేటు వద్ద ధర్నాకు దిగారు. వెలుపల ఈ వ్యవహారం సాగుతూండగానే అసెంబ్లీ సమావేశాలు జరిగిపోయాయి. మండలిలోని వైసిపి సభ్యులు వాకౌట్ చేయడంతో పార్టీ ఎమ్మెల్యేలంతా గవర్నర్ నరసింహన్ వద్దకు పరుగులు పెట్టారు. రాజ్‌భవన్‌లో ఆయన లేకపోవడంతో అక్కడి అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ‘కోర్టు ఉత్తర్వును గౌరవించేలా స్పీకర్‌ను ఆదేశించండి..రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షకులుగా మాకు న్యాయం చేయండి’అని అందులో కోరారు. తమ నిరసన తెలియజేస్తూ శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరు కావాలని శాసన సభా పక్ష సమావేశంలో నిర్ణయించారు. మరో పక్క రోజా సస్పెన్షన్‌ను నిలిపివేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై డివిజన్ బెంచికి రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేయడంతో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠను రేకెత్తించింది. ఈ వ్యవహారాన్ని సభే తేల్చాలన్న స్పీకర్ కోడెల దీనిపై సోమవారం చర్చకు అనుమతించారు. మరోపక్క విపక్ష నేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ముఖ్యమంత్రి, ముగ్గురు మంత్రులపై హక్కుల తీర్మానాన్ని చేపట్టేందుకు వైసిపి నోటీసులు ఇచ్చింది.