తెలంగాణ

ఢీ అంటే ఢీ అంటున్న విద్యాసంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణలో ప్రైవేటు కాలేజీల ఆందోళన రోజురోజుకూ ముదురుతోంది. ప్రభుత్వం పోలీసు, విజిలెన్స్ తనిఖీలు ఆపకుంటే కాలేజీల మూత కొనసాగిస్తామని చెబుతున్న యాజమాన్యాలు మంగళవారం నుండి వివిధ రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి వారితో తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించాయి. యాజమాన్యాల సమస్యలపై మాట్లాడిన కాంగ్రెస్, బిజెపి, వామపక్ష నాయకులు ప్రైవేటు విద్యాసంస్థలపై దాడులు తగవన్నారు.
ప్రభుత్వ పరంగా మాత్రం కాలేజీల్లో ప్రమాణాలు పాటించేందుకు తాము పరిశీలనలు తప్పకుండా చేస్తామని, ఈ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేసేది లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. మరో పక్క యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గొద్దని టాస్క్ఫోర్సు కమిటీల ద్వారా తనిఖీలు జరపాల్సిందేనని విద్యార్ధి సంఘాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎఎఫ్‌ఆర్‌సి చైర్మన్ జస్టిస్ స్వరూపరెడ్డిలకు ఒక వినతి పత్రం ఇచ్చినట్టు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు కోట రమేష్, బి సాంబశివ . విద్యార్ధులు చదువుకుంటున్న సమయంలో పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది వచ్చి తనిఖీలు నిర్వహించడం సరైంది కాదన్నారు. తనిఖీలకు టాస్క్ఫోర్సు కమిటీలను వేయాలని వాటి ద్వారానే పరీక్షలు నిర్వహించాలని వారు సూచించారు. అనేక పోటీ పరీక్షలు జరిగే సమయంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సంస్థలను మూసివేస్తామని ప్రకటించడం వల్ల ఇబ్బందులు అనివార్యమవుతున్నాయని, దీనిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని వారు చెప్పారు.
మరో పక్క రాష్ట్రంలోని మొత్తం 6800 విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొంటున్నాయని జాక్ నేతలు గౌతం రావు, జి రమణారెడ్డి, సూరం ప్రభాకరరెడ్డి, డాక్టర్ కె రాందాస్‌లు హెచ్చరించారు. స్పాట్ వాల్యూయేషన్‌ను సైతం తాము బాయ్‌కాట్ చేస్తామని వారు చెప్పారు. అలాగే 21వ తేదీన పాలిసెట్‌కు పరీక్ష కేంద్రాలను ఇచ్చేది లేదని వారు స్పష్టం చేశారు.