కృష్ణ

స్టాండింగ్ కమిటీలో రభస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సమావేశంలో భగ్గుమన్న పాలకుల విబేధాలు
విజయవాడ , నవంబర్ 26: గురువారం సాయంత్రం విఎంసిలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం రసాభాసగా జరిగింది. విఎంసిలో పాలక పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీలో పాలకుల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. గతంలో జరిగిన కౌన్సిల్ తీర్మానాలతోపాటు స్టాండింగ్ కమిటీ తీర్మానాల విషయంపై కూడా కొన్ని అంశాలను వాయిదా వేస్తూ వెనక్కు తీసుకొన్న వైనంతో బహిర్గతమైన విబేధాలు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాలక సభ్యుల మధ్య మరోసారి విబేధాలు వెల్లువెత్తిన వైనంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ స్టాండింగ్ కమిటీకి అధ్యక్షత వహించిన మేయర్ కోనేరు శ్రీ్ధర్ సమావేశం నుంచి తన ఛాంబర్ వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. విఎంసి ఈ గవర్నెన్స్ మాడ్యూ ల్స్ వెబ్‌సైట్‌కు మాత్రమే వినియోగంలో ఉన్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ నుంచి కూడా విఎంసి ఇ గవర్నెన్స్‌ను వాడుకలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన ఆప్స్‌ను రూపకల్పన చేసే క్రమంలో విఎంసి అధికారులు టెండర్లు పిలిచిన టెండర్లలో ఎంఎస్ కోడ్ ట్రీ టెక్నోలోజీస్ వారు 27లక్షల 36వేల రూపాయలతో అందరి కన్నా తక్కువ కోడ్ చేయడంతో వారికి టెండర్ ఖరారు చేస్తూ మొబైల్ ఆప్స్ అభివృద్ధి చేసే నిమిత్తం విఎంసి అధికారులు ప్రవేశ పెట్టిన అంశంపై 44వ డివిజన్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యు డు కాకు మల్లికార్జున రావు అభ్యంతరం చెబు తూ సమగ్రంగా చర్చించిన తరువాతే తగు నిర్ణయం తీసుకోవాలని పేర్కొనడంతో అందుకు స్పందించిన మేయర్ శ్రీ్ధర్ టెండర్ ఖరారై పరిశీలనార్థం వచ్చిన అంశాన్ని వెనక్కి పంపరాదని, ఆమోదించాల్సిందిగా తెలిపినప్పటికీ మల్లికార్జున రావు ససేమిరా అనడంతో మేయర్ అసహనంతో ఛాంబర్‌కు వెళ్లిపోయారు. ఈవిషయంపై విఎంసి అధికారులు స్టాండింగ్ కమిటీని తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రతి నెలా విధిగా జరుగుతున్న కమిటీ సమావేశానికి ముందుగా తెలపకుండా టెండర్ ఖరా రు చేసి పరిశీలనార్థం సమావేశానికి పంపడం గర్హనీయమంటూ కాకు మల్లికార్జున రావు తన వాదన వినిపించారు. ఇదిలావుండగా విఎంసికి చెందిన షాపింగ్ కాంప్లెక్సులలోని షాపుల లీజు గడు వు పెంపు విషయం ఎట్టకేలకు స్టాండింగ్ కమిటీ ఆ మోదం తెలిపింది. గతం లో జరిగిన సమావేశాలలో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాకు మల్లికార్జు న రావు అధికారుల తీరు పై అభ్యంతరం చెప్పడం తో వాయిదా పడగా ప్రస్తుత సమావేశంలో ఆమో దం తెలపడం గమనార్హం. వీటితోపాటు మరికొన్ని అంశాలపై చర్చ జరిపిన స్టాండింగ్ కమి టీ కొన్నింటిని ఆమోదించి మరికొన్నింటిని ర్యాటిఫై చేసింది.