రాష్ట్రీయం

సిఎం నివాసం సక్రమమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 20: రాజధాని పరిధిలోని కృష్ణానది కరకట్టపై సిఎం ఉంటున్న నివాసం సక్రమమో.. అక్రమమో తేల్చిన తర్వాతే మత్య్సకారుల ఇళ్ల జోలికి రావాలని వైకాపా మంగళగిరి ఎమ్లెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి మండలంలోని సీతానగరంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు మత్య్సకారులకు చెందిన 32 ఇళ్లను తొలిగించేందుకు యత్నించారు. అయితే తెలుగుదేశం, వైసిపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బిజెపిల నాయకులు ఇళ్లను తొలగించటానికి వీలులేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఇళ్ల తొలగింపును తాత్కాలికంగా వాయిదావేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్‌కె మాట్లాడుతూ ఉండవల్లిలోని నది కరకట్టపై గల గెస్ట్‌హౌస్‌లో సిఎం నివాసగృహం సక్రమమా, అక్రమమా తేల్చిన తరువాతనే రెవెన్యూ అధికారులు మత్య్సకారుల ఇళ్లను తొలిగించాలన్నారు. కోర్టు తీర్పు ఉందని రెవిన్యూ అధికారులు ప్రత్యామ్నాయం చూపకుండా బలవంతంగా తొలగించేందుకు యత్నించటం దారుణమన్నారు. అధికారులు కొంత వ్యవధి ఇస్తే హైకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే ఆర్‌కె చెప్పారు. రామకృష్ణ మిషన్‌కు 60 సంత్సరాలుగా క్రితం గిఫ్ట్ కింద వచ్చిన స్థలంలో 50 ఏళ్లుగా నివాసముంటున్న మత్య్సకారుల ఇళ్లను తొలగించాలని రామకృష్ణ మిషన్ కమిటీ సభ్యులు కోరటం అన్యాయని అఖిలపక్ష నేతలు అన్నారు.