రాష్ట్రీయం

నేడే తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: దాదాపు పదకొండేళ్ల కిందట చార్మినార్ సమీపంలోని మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఈ నెల 16 సోమవారం తీర్పు వెలువడనుంది. దీంతో నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నేషనల్ ఇనె్వస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కోర్టు కం నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగింది. 2007 మే 18న శుక్రవారం మధ్యాహ్నం 1.25 నిమిషాలకు దాదాపు 10 వేల మంది ప్రార్థనలు చేసేందుకు సమాయత్తం అవుతుండగా మసీదులోని ఖాళీ ప్రదేశంలో ఉన్న ఉజుఖానా వద్ద అమర్చిన పైప్ బాంబ్‌ను ఉగ్రవాదులు సెల్‌ఫోన్ ద్వారా పేల్చివేశారు. ఈ ఘటనలో అప్పట్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన ప్రాంతంలో చెలరేగిన హింస, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు చనిపోయారు. మొత్తం రెండు ఘటనల్లో మరో
ఐదుగురు తీవ్రంగా గాయపడగా, 58 మంది గాయపడ్డారు. పేలుళ్ల అనంతరం అదే ప్రాంగణంలో పేలేందుకు సిద్ధంగా ఉన్న మరో రెండు ఐఈడీ బాంబులను కనుగొని పోలీసులు వాటిని నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో 10 మందిని నిందితులుగా చేర్చిన ఎన్‌ఐఏ తగిన ఆధారాలతో చార్జిషీట్లను ఇప్పటికే సమర్పించింది. ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన అప్పటి ఉమ్మడి ఏపీ పోలీసులు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) ఆదేశాలతో హైదరాబాద్‌కు చెందిన హర్కత్-ఉల్-జిహాద్-అల్- ఇస్లామీ (హ్యుజి) కమాండర్ మహ్మద్ షాహిద్ బిలాల్ ఈ ఘటనకు సూత్రధారిగా వ్యవహరించాడని, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి దాడికి పథకం రచించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. స్థానిక పోలీసులు ఈ కేసు విషయంలో కొందరు అమాయకులను వేధించి అప్రూవర్‌లుగా మారుస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. సీబీఐ తనదైన శైలిలో దర్యాప్తు చేయగా ఈ పేలుళ్ల వెనుక హిందూత్వ సంస్థల హస్తం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. తరువాత ఈ కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. తొలిసారి హిందూత్వ సంస్థలకు చెందిన వారు ఈ దాడి చేసినట్లు కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ కూడా నిర్ధారించింది. ఈ కేసులో 10 మందిని నిందితులుగా చేర్చింది. సీబీఐ 2010, 2011లో ఈ కేసుకు సంబంధించి దేవేందర్‌గుప్తా, లోకేశ్ శర్మలను అరెస్టు చేసి అనంతరం కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది. ఎన్‌ఐఏ విచారణలో ఇద్దరు నిందితులు తెలిపిన వివరాలను బట్టి 2004లో ఒకసారి, 2007లో మరోసారి ముస్లిం ప్రజానీకం అధికంగా ఉన్న ప్రాంతంలో పేలుళ్లు జరపాలని పథకం రచించారని తేల్చింది. కేసులో వాదోపవాదనలు ముగిసి తీర్పు వెలువరించేందుకు కోర్టు నిర్ణయించింది.