రాష్ట్రీయం

తిరుమలలో తరగని రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 15: వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు 64,804 మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ద్వారా రూ.3.49 కోట్ల ఆదాయం లభించింది. మరో 29 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరు స్వామివారిని దర్శించుకునేందుకు 10 నుండి 12 గంటల సమయం పడుతోంది.
గదులు దొరకని భక్తులు ఉద్యానవనాలు, ఆరుబయట ఖాళీ ప్రదేశాల్లో విశ్రమిస్తున్నారు. కాగా తిరుమల జేఈవో శ్రీనివాసరాజు క్యూలైన్లలో ఉన్న భక్తులకు కావాల్సిన సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకుంటూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడడంతో ఉత్తీర్ణులైనవారు స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి తరలివస్తున్నారు. కాగా తలనీలాలు సమర్పించడానికి కూడా భక్తులు రెండు గంటల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రద్దీ మరికొంతకాలం ఉండే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు తెలిపాయి. రద్దీ మరింత పెరిగితే విఐపీ దర్శనాలను కుదించి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా అధికారులు యోచిస్తున్నారు.
ఇదిలావుండగా వేసవి నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వస్తున్న భక్తుల కాళ్లు కాలకుండా టీటీడీ ట్యాంకర్ల ద్వారా నాలుగు మాడవీధుల్లో నీళ్లు చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో పాదరక్షలు వేసుకోకూడదన్న నిబంధనలను అమలుచేస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఈక్రమంలో ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు కాళ్లకు పాదరక్షలు లేకుండా సుమారు అరకిలోమీటర్ మేర నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈనేపధ్యంలో భక్తులు అసౌకర్యానికి గురికాకుండా నీళ్లు చల్లడంతో పాటు కార్పెట్లను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది.

చిత్రాలు..స్వామివారిని దర్శించుకోడానికి క్యూలైన్లలో వెళుతున్న భక్తులు.* ఆరుబయట విశ్రమించిన దృశ్యం