రాష్ట్రీయం

మోదీకి ఏపీపై ప్రేమ కలగాలని ప్రార్థించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 15: ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ పట్ల మరింత ప్రేమను కల్పించి ప్రత్యేక హోదా ఇచ్చే బుద్ధిని ప్రసాదించమని ఆ తిరుమల వేంకటేశ్వరస్వామి ని ప్రార్థించానని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనే ని రాజకుమారి అన్నారు. ఆదివారం ఆమె కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ రా ష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో గానీ, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో ఇప్పటికీ సమయం మించిపోలేదని, ఆ దిశగా ప్రధాని మోదీకి జ్ఞానాన్ని ప్రసాదించాలని దేవుడ్ని కోరుకున్నానన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, మెట్రో రైలు, రైల్వేజోన్, హైకోర్టు ఇలా రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులను కల్పించాలని ఆమె కోరా రు. మిత్రపక్షానికి సంబంధించిన అంశాలపై తాను మాట్లాడబోనని, అది రాజకీయం అవుతుందన్నారు. ఒక మహిళా కమిషన్ చైర్‌ఫర్సన్‌గా మహిళల జీవితాలు ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నానన్నారు. ముఖ్యంగా మహిళలపై అ త్యాచారాలు, దాడులు జరగకూడదని కోరుకుంటున్నానన్నారు. ఇలాంటి వాటిని అరికట్టే శక్తిని తనకు దేవుడు ప్రసాదించాలని కూడా కోరుతున్నానన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా నేడు మహిళలపై దాడులు చేస్తూ మృగాల్లా వ్యవహరిస్తున్న వారి మనస్తత్వంలో మార్పు రావాలని ఆ దేవుడ్ని ప్రార్ధించానన్నారు. తాను ఆ భగవంతుని సన్నిధిలో స్వామికి ఒక ప్రశ్న వేయదలుచుకున్నానన్నారు. స్వామి దర్శనానికి వచ్చేవారు వివిధ రకాలుగా ఉంటారన్నారు. న్యాయం చేయమని కోరతారన్నారు. అన్యాయం చేసినవా రు కూడా తప్పులు సరిదిద్దుకోమని కోరుతారన్నారు. అ యితే కేంద్రంలో ప్రధాని మోదీ కానీ, సలహాలు ఇచ్చే వారు గానీ రాష్ట్రానికి అన్యాయం చేసి తమకు న్యాయం చేయమని దేవుడ్ని కోరుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నా రు. అలాంటి వారికి జ్ఞానం కల్పించాలని స్వామిని కోరుతున్నానన్నారు. ఇక కాశ్మీర్‌లో జరిగిన అత్యాచారం, ఢిల్లీలో నా లుగేళ్ల బాలికపై జరిగిన అత్యాచారాలు దారుణమన్నారు. దేశంలో జరిగే అనేక సంఘటనలు చూస్తుంటే మనసంతా బాధతో నిండిపోతోందన్నారు. మనిషి మనస్తత్వంలో మా ర్పు రావాలన్నారు. మనిషి మనిషిలా వ్యవహరించాలే తప్ప మృగాల వలే ఉండకూదన్నారు. భగవంతుడు గొప్ప మాన వ జన్మ ఇచ్చాడన్నారు. అయితే నేడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మానవ జన్మకంటే జంతు జన్మలే మేల నే భావన కలుగుతోందన్నారు. తల్లి, బిడ్డ, చెల్లి వంటి వారి పై ఇలాంటి అత్యాచారాలు చేయడం నీచమన్నారు. అలాం టి వారికి ఎంత కఠిన శిక్ష వేసినా తక్కువేనన్నారు. వీరికి బతికినప్పుడే శిక్ష విధించాలన్నారు. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా నిందితులకు మద్దతిస్తున్నారని తెలుసుకుని ఆవేదన చెందానన్నారు. తప్పుచేసిన వాడు ఎవడైనా, ఏ పార్టీకి చెందినవారైనా శిక్ష విధించాలన్నారు. నా వంతుగా తాను ఇలాంటి దుర్మార్గాలను అరికట్టేందుకు కృషి చేస్తానని నన్నపనేని అన్నారు.