రాష్ట్రీయం

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 15: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కోస్తాంధ్రలో పలు పట్టణాల్లో ఆదివారం పగటి ఉష్ణోగ్రతల్లో ఒకటి నుంచి రెండు డిగ్రీలు అధికంగా నమోదయ్యా యి. వేసవి ప్రభావంతోనే పగటి ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల నమోదవుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. కోస్తాలోని కళింగపట్నంలో 35 డిగ్రీల మే ర ఉష్ణోగ్రత నమోదు కాగా సాధారణం కంటే మూడు డిగ్రీల అధికం. అలాగే గన్నవరంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కా గా, సాధారణం కంటే రెండు డిగ్రీలు అధి కం. కాకినాడ, తుని, పట్టణాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికం. విశాఖలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఒక డిగ్రీ అధికంగా వాతావరణ కేంద్రం అధికారు లు పేర్కొన్నారు. ఇక రాయలసీమ జిల్లా ల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురం 41, కర్నూలు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వేసవి ప్రభావంతో ఉత్తరాంధ్రలోని పలుచోట్ల క్యుములో నింబస్ ప్రభావం కన్పిస్తోంది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని పలు చోట్ల ఆదివారం ఉరుములతో కూడిన వర్షాలు కురిసాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 24 గంటల్లో ఉరుములు, గాలులతో కూడిన చిరుజల్లులు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. గత 24 గంటల్లో మద్నూరు, మోమిన్‌పేటలలో రెండేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణం చెప్పుకోదగ్గ ఎక్కువ వేడిగా లేదు. పగటివేళ అత్యధిక ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ నిజామాబాద్‌లో నమోదైంది. హైదరాబాద్‌లో 38 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్‌నగర్, మెదక్, రామగుండంలలో 39 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుండి 28 డిగ్రీల మధ్య నమోదయింది.