రాష్ట్రీయం

జమిలి ఎన్నికలు ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: దేశంలో పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. సీపీఎం పార్టీ 22వ మహాసభల సందర్భంగా ఆదివారం ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమిలి ఎన్నికలతో రాష్ట్రాల హక్కులకు విఘాతం కలుగుతుందని అన్నారు. వివిధ మతాలు, బాషలు, కులాలు కగిలిన భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నమని మండిపడ్డారు. కేంద్రం ఈ విధానాన్ని అమలుకు ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారమార్గాల ఎజెండగా ఈ నెల 18 నుంచి 22 వరకు ఆర్టీసీ కళ్యాణ మండపంలో 22వ అఖిల భారత మహాసభలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహాసభల ప్రాంగణానికి కామ్రేడ్ మహ్మద్ అమీన్ నగర్ ప్రాంగణంగా, సభా వేదికకు కామ్రేడ్ కగేందాస్ పేర్లను పెట్టినట్టు తెలిపారు. 18న ఉదయం 10 గంటలకు మల్లు స్వరాజ్యం జెండా ఆవిష్కరణతో మహాసభలు ప్రారంభం అవుతాయని, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ప్రారంభోపన్యాసం చేస్తారని తెలిపారు. ఈ సభలకు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) భట్టాచార్య, జీఆర్ శివశంకర్, ఆర్‌ఎస్‌పీ కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఎస్‌యుసీఐ నాయకులు ఆషీస్ బట్టాచార్యలు హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 764 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని, ముఖ్యంగా బెంగాల్ నుంచి 175 మంది, కేరళ నుంచి 170 మంది వీరితో పాటు 74 మంది అబ్జర్వర్స్ ఉంటారని తెలిపారు. ముఖ్యమైన 30 తీర్మానాలపై విస్తృతంగా చర్చించి ఆమోదిస్తామని అన్నారు. ఈ సభల్లో పార్టీ నిర్మాణం, బలోపేతం, భవిష్యత్ ప్రజా ఉద్యమాలు తదితర అంశాలను చర్చిస్తామని తెలిపారు. మతోన్మాద బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా ఉన్న మిగతా పార్టీలతో కలిసి సీపీఎం పనిచేస్తుందన్నారు. పొత్తులపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని, ఎన్నికల సమయంలో ప్రాంతీయ పరిస్థితుల ఆధారంగా పొత్తులుంటాయని చెప్పారు. మహాసభల ముగింపు రోజైన 22వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు చెప్పారు.
రాష్ట్రాలకు నిధుల పంపిణీలో వివక్ష సరికాదని రాఘవులు అన్నారు. ప్రస్తుత నీతి ఆయోగ్‌కు కార్పొరేట్ ఎజెండా మాత్రమే ఉందని మండిపడ్డారు. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా నిధులు ఇవ్వాలని, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్థికి తోడ్పాటును అందించాలని డిమాండ్ చేశారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీవీ రాఘవులు