రాష్ట్రీయం

ఎక్కడి రైళ్లు అక్కడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, ఏప్రిల్ 15: ఓహెచ్‌ఇ వైరు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఆదివారం సాయంత్రం కాజీపేట - విజయవాడ సెక్షన్‌లో రెండు గంటల పాటు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైల్వేవర్గాల కథనం ప్రకారం- ఖమ్మం జిల్లా గార్ల రైల్వే స్టేషన్లో ఓహెచ్‌ఇ వైరు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కాజీపేట-విజయవాడ సెక్షన్‌లో డౌన్‌లైన్లో రైళ్లరాకపోకలకు అంతరాయం కలిగింది. తెగిపోయిన విద్యుత్‌వైరును సరిచేయడానికి రెండు గంటల సమయం పట్టడంతో ఆ సమయంలో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నెక్కొండలో సింగరేణి ప్యాసింజర్, కేసముద్రంలో గోల్కొండ ఎక్స్‌ప్రెస్, మహబూబాబాద్‌లో మణుగూర్ ప్యాసింజర్, గుండ్రాతిమడుగులో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. కేసముద్రంలో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్దిసేపట్లో మహబూబాబాద్ వెళుతుందని ఆశిస్తే రెండుగంటల పాటు ఇక్కడే రైలు నిలిపివేయడం ఏమిటని ప్రయాణికులు రైల్వే స్టేషన్ సిబ్బంది ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 4-30 గంటలకు కేసముద్రం వచ్చిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను విద్యుత్‌లైన్ మరమ్మతు తరువాత రాత్రి 6-30 గంటల సమయంలో పంపించారు.

చిత్రం..కేసముద్రంలో ఆదివారం నాడు నిలిచిపోయిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు