రాష్ట్రీయం

దళిత యువతిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: జిల్లాలోని పూసపాటిరేగ మండలానికి చెందిన దళిత యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. పూసపాటిరేగ ఎస్సీ కాలనీకి చెందిన ఆమె దివ్యాంగురాలు. తన పెద్దమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆటోలో బయలుదేరి విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్ వద్దకు చేరుకుంది. ఆ తరువాత సాయంత్రం 5.30 గంటలకు పూల్‌బాగ్ వెళ్లేందుకు మరో ఆటో ఎక్కింది. అప్పటికే ఆ ఆటోలో డ్రైవర్, మరో ఇద్దరు యువకులు ఉన్నారు. ఆమె పూల్‌బాగ్‌లోని సత్యకళ
కల్యాణ మండపం వద్ద ఆటోను ఆపమంది. అయితే అప్పటికే ఆటోలో ఉన్న యువకులు తన చున్నీతో నోరు నొక్కేయడంతో ఏమీ చేయలేక అలా ఉండిపోయానని ఆమె జరిగిన సంఘటనను వివరించింది. ఆటోను శివారు ప్రాంతమైన ఇండస్ట్రియల్ ఎస్టేట్ వైపు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారని పేర్కొంది. ఆ తరువాత రాత్రి 8 గంటల సమయంలో అటువైపుగా సైకిల్‌పై వస్తున్న ఓ వ్యక్తి సాయంతో ఇంటికి చేరుకున్నానని తెలిపింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లి ఆసుపత్రిలో చేర్పించింది. అనంతరం ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ సంఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డీబీఎస్‌యు నేత చిట్టిబాబు, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, బీజేపీ నేత శివప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆదిరాజు, ఇతర సంఘాల నాయకులు గండ్రెడ్డి సత్యనారాయణ తదితరులు ఎస్పీ పాలరాజును కోరారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ పాలరాజు స్పందిస్తూ నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను నియమించామన్నారు. 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.