రాష్ట్రీయం

జూన్ నుంచే సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 16: ఈ ఏడాది జూన్ నుంచే రైతులకు సాగునీరు అందించాలని సకాలంలో సేద్యం పనులు పూర్తిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయంపై ఆయన సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రెయిన్‌గన్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ఖరీఫ్ సేద్య ప్రణాళికలు పటిష్ఠంగా అమలుచేయాలన్నారు. సూక్ష్మపోషకాలను రైతులకు ఉచితంగా అందజేయాలని, దీనివలన వివిధ పంటల దిగుబడులు పెరిగాయని గుర్తుచేశారు. అంతర్జాతీయంగా మేలైన పద్ధతులను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలుచేయాలన్నారు. పోషకాహార లోపమన్నదే రాష్ట్రంలో ఉత్పన్నం కాకూడదని సూచించారు. ప్రతి శాఖ తన ప్రగతిని నెల, త్రైమాసికాల వారీగా విశే్లషించి లక్ష్యాలు చేరుకోవాలన్నారు. వ్యవసాయంలో నూరు శాతం యాంత్రీకరణ జరగాలని, దీనివలన డ్వాక్రా మహిళలకు ఉపాధితో పాటు రైతులకు సేంద్రీయ ఎరువుల కొరత తీరుతుందని, వ్యవసాయ దిగుబడులు కూడా పెరుగుతాయన్నారు. కర్నూలులో భూగర్భ జలాలు ఆరు మీటర్ల మేర పెరగడం నీరు-ప్రగతి విజయమేనని అభివర్ణించారు. ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద 8వేల కోట్ల పైబడి పనులను చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి పనుల్లో వెనుకబడటానికి కారణాలను వారం వారం విశే్లషించాలని, వీటిని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం రహదారి సుందరీకరణ బాగా చేశారని, ఇదే తరహాలో గుంటూరు వరకు చేపట్టాలని సూచించారు. ఇదే తరహాలో జిల్లాలోని అన్ని రహదారులు అభివృద్ధి చేయాలన్నారు.
మనల్ని మనం శిక్షించుకోరాదు
ఒక్కరోజు బంద్ వల్ల రాష్ట్రానికి ఎంత నష్టమో ఆలోచించాలని ఆందోళనకారులకు సీఎం సూచించారు. ‘మనల్ని మనం శిక్షించుకోకూడదు. మనకు అన్యాయం చేసినవారిని శిక్షించా’లని హితవు పలికారు. నిరసనల వలన రాష్ట్రానికి ప్రయోజనం ఉండాలని, అందుకే అరగంట నిరసనలో పాల్గొని మరో గంట అదనంగా పని చేయాలని కోరానని తెలిపారు.