రాష్ట్రీయం

కేంద్రం దిగొస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఏప్రిల్ 17: రాష్ట్రంలో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గం ఒక మాఫియా గ్యాంగ్ అని వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహనరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం కృష్ణాజిల్లా మైలవరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పాలనపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఒక మాఫియాగా తయారై రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాలుగవ నెలలో 20వ తేదీన పుట్టాడని అందుకే ఆయన ఒక 420 అయ్యాడని విమర్శించారు. ఈ 420 ప్రత్యేక హోదా కోసం తన పుట్టిన రోజున ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని చెబుతున్నాడని, ఈ 420 చేసే కొంగజపానికి కేంద్రం దిగొస్తుందా అని ప్రశ్నించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడి ఆ ముడుపులతోనే వైసీపీలో గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను
సంతలో పశువులను కొన్నట్లు కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. బాబుకు దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతుందని, మంత్రులు, ఎమ్మెల్యేలే సూత్రధారులు, పాత్రధారులన్నారు. ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియాలతో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. అవినీతిలో నెంబర్ వన్ చంద్రబాబు, ఆయన అనుచరుడు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. నూజివీడు అని, కర్నూలు అని.. ప్రజలను మభ్యపెట్టి తన అనుచరులతో అమరావతి ప్రాంతంలో భూములను కొనుగోలు చేయించి తర్వాత అమరావతి రాజధాని అని ప్రకటించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని రైతుల నోట్లో మట్టి కొట్టారన్నారు. జలవనరుల శాఖ మంత్రి అయి ఉండి సొంత నియోజకవర్గంలోనే తాగు, సాగునీటిని అందించలేని అసమర్థ మంత్రి ఉమ అన్నారు. సామాన్యుడికి రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు కూడా లభించని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లుల ధరలు తగ్గిస్తామని చెప్పి విపరీతంగా పెంచాడన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఒక్క పైసా కూడా మాఫీ చేయకపోవటంతో ఆడపడుచులు కంట తడి పెడుతున్నారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని జాబులు వచ్చాయని ప్రశ్నించారు. ఉన్న జాబులు ఊడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో పరిశ్రమల స్థాపనకు ఆయా సంస్థల ప్రతినిధులతో సమావేశమై 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమలు వస్తున్నాయని, వీటి ద్వారా 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పిన చంద్రబాబు ఇప్పటికి ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చాడని ప్రశ్నించారు. బాబు మోసాలకు కాలం చెల్లిందని ఇటువంటి మోసగాడిని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. ఈ దఫా ఎన్నికలలో బాబు తాను సంపాదించిన అక్రమ డబ్బుతోనే ఓటుకు మూడు వేలు ఇచ్చి కొనుగోలు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నాడని, ఆ డబ్బు తీసుకుని వైసీపీకి ఓటు వేయండని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం తాము ఆది నుండి ఒకే మాట మీద ఉన్నామన్నారు. బాబు లాగా యు టర్న్ తీసుకోలేదని గుర్తు చేశారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేసినట్లే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఆందోళన చేసినట్లైతే కేంద్రం దిగివచ్చేదన్నారు. తాను అధికారంలోకి వస్తే తాను నవరత్నాలతో రాజన్న రాజ్యం స్థాపిస్తానన్నారు. అదేవిధంగా ప్రతి పేద వానికి ఇళ్ళస్థలంతోపాటు పక్కా ఇంటిని నిర్మించి ఇస్తానన్నారు. తనను ఆదరించాలని, పేదల కోసం నిరంతరం పని చేస్తానని అభ్యర్థించారు. ఈసమావేశంలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, రక్షణనిధి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.